Sep 24,2023 01:46

ప్రజాశక్తి - బాపట్ల
విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి జి వాణి అన్నారు. పాలిటెక్నీక్ కళాశాలలో శనివారం జరిగిన న్యాయ అవగాహనా సదస్సులో ఆమె మాట్లాడారు. విద్యార్థినిలు చట్టాలపై అవగాహన   కల్పించుకోగలిగితే భవిష్యత్తులో కుటుంబంలో అందరికీ న్యాయం పట్ల అవగాహన కలిగించగలుగుతారన్నారు. అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి రుక్మిణి మాట్లాడుతూ సమాజంలో మారుతున్న పరిణామాల దృష్ట్యా ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సదస్సుకు బార్ అసోసియేషన్ అధ్యక్షులు భీమా లీలాకృష్ణ అధ్యక్షత వహించారు. సదస్సులో సీనియర్ న్యాయ వాదులు బండి రామ్మూర్తి నాయుడు, ఊట్ల రామారావు, సిహెచ్ రామాంజనేయులు, ఎస్ఐ రఫీ, డాక్టర్ సందీప్, కళాశాల ప్రిన్సిపాల్ రాధాకృష్ణ మూర్తి పాల్గొన్నారు.