ప్రజాశక్తి - ఏలూరు
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.రాజేశ్వరి పడమర వీధి గాంధీ మైదానంలో సోమవారం చట్టాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో మహిళలపై బాలబాలికలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, అప్రమ త్తంగా మెలగాలని సూచించారు. బాధితులకు పోక్సో చట్టం ద్వారా రక్షణ కల్పిస్తారని, ఎవరైనా బాధితులు ఉంటే పరి హారం పొందడం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఫిబ్రవరి 11వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందించే ఉచిత న్యాయ సేవలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శామ్యూల్ పాల్గొన్నారు.










