
ప్రజాశక్తి - నందిగామ : వృద్ధులకు ఎటువంటి సమస్యలు వచ్చినా చట్టపరంగా న్యాయశాఖ తోడ్పాటు అందిస్తుందని నందిగామ సీనియర్ కోర్టు సివిల్ జడ్జి వి.లక్ష్మీ రాజ్యం పేర్కొన్నారు. నందిగామ మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో, అక్టోబర్ ఒకటవ తేదీన సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా శనివారం రాత్రి మాగల్లు గ్రామంలో ఖాసీం అండ్ ఖాసీం వృద్ధాశ్రమంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. నందిగామ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు న్యాయవాది బొబ్బిళ్ళ పాటి భాస్కర రావు అధ్యక్షతన జరిగిన న్యాయ విజ్ఞానసదస్సులో ముఖ్య అతిథిగా జడ్జి వి.లక్ష్మీ రాజ్యం పాల్గొని మాట్లాడారు. వద్ధుల యొక్క చట్టాల గురించి, వారి సంరక్షణ, పోషణ గురించి, అవగాహన కల్పించారు. ఆశ్రమ నిర్వాహకురాలు హసీనా బేగం, కరిముల్లా, నందిగామ సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మీ రాజ్యం, ఎజిపి మట్టా ప్రసాద్, ఎక్కిరాల హనుమంత రావు, న్యాయవాదులు గుర్రాల వెంకటరత్నం, కొమ్మినేని మౌళేశ్వరావు, కస్తాల నూతన, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.