Aug 16,2023 20:56

సమావేశంలో మాట్లాడుతున్న జడ్జి గీత

రాయచోటి రూరల్‌ : బాలల న్యాయ చట్టం తప్పనిసరిగా పటిష్టంగా అమలు చేయాలని డిస్టిక్‌ లెవెల్‌ కన్సల్టేషన్‌ మీటింగ్‌ న్యాయ సేవా సదన్‌ జడ్జి జి.గీత, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.ప్రదీప్‌ కుమార్‌ అన్నారు. బుధవారం జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో జువెనైల్‌ జస్టిస్‌ కమిటీ సిఫార్సులపై చైల్డ్‌ వైరుధ్యానికి సంబం ధించిన అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జువెనైల్‌ జస్టిస్‌ చట్టం, పిల్లల నేరాల నివారణ, సైకాలజిస్ట్లతో కౌన్సెలింగ్‌, మళ్లింపు, నిర్బంధానికి ప్రయత్నాలు, నాన్‌ కస్టడీ ప్రయత్నాలు, పిల్లల పునరావాసం, పునరుద్ధరణ పద్ధతులు, న్యాయమైన విచారణ, పిల్లల స్నేహపూర్వక విధానాలకు హక్కు, వత్తి నైపుణ్య కోర్సులు, మందుల దుర్వినియోగం, నేర బాధ్యత యొక్క కనీస వయస్సు, క్రిమినల్‌ మెజార్టీ వయస్సు మొదలగు అంశాలను చర్చించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రెండవ అదనపు జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కె.భార్గవి, రాయచోటి అడిషనల్‌ ఎస్పీ డాక్టర్‌ వి.బి.రాజ్‌ కమల్‌, కడప దిశ డిఎస్‌పి ఎస్‌.రమాకాంత్‌, డిస్ట్రిక్ట్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ బి.ఆర్‌.సుభాష్‌ యాదవ్‌, సైకాలజిస్ట్‌ పి.వి.సునీత, అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎ.పద్మావతి, పి.నిత్య కుమార్‌, ఇ.శిరీష, చెన్నారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, వెంకట రాముడు పాల్గొన్నారు.