
ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్: స్థానిక మున్సిపాలిటీ 24వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ, రోడ్ విస్తరణపై అపోహలు వద్దని తెలిపారు.చట్ట ప్రకారం రోడ్ విస్తరణ చేస్తామని చెప్పారు. కోర్టు కూడా రోడ్ విస్తరణ వద్దని చెప్పలేదని తెలిపారు.కోర్టు ఆదేశాల మేరకే నడుచుకుంటామని చెప్పారు.టీడీఅర్ బాండ్స్ కు భవన యజమానులు అంగీకరిస్తే ఆ ప్రకారం ముందుకు వెళ్ళమని.. లేదా భూసేకరణ ద్వారా రోడ్ విస్తరణకు ముందుకు వెళ్ళమని కోర్టు చెప్పిందని వివరించారు. అనంతరం ఆయన వార్డ్‌లో పర్యటించారు. రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే. దృష్టికి తీసుకు వచ్చారు.ఈ సంధర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ, గడపగడపలో ఇచ్చిన హామీలకు సంబంధించి రూ.2 కోట్లు విడుదల అయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సుబ్బలక్ష్మి, వైస్ చైర్మన్‌లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు, 24వ ఇంఛార్జి టౌన్ వైఎస్‌ఆర్ అధ్యక్షుడు ఏక శివ, 23వ ఇంఛార్జి కణితి అన్నపూర్ణ, కణితి వాసు, ఏరియా.ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్ రాజుబాబు, పెట్ల నాయుడు, జగనన్న సచివాలయాల కన్వీనర్ తమరాన శ్రీను, ముస్లిం సంచార జాతుల స్టేట్ డైరెక్టర్ చోటి, అయ్యరక కార్పోరేషన్ స్టేట్ డైరక్టర్ కర్రి శ్రీనివాసరావు, మున్సిపల్ కౌన్సిలర్లు వీరమాచినేని జగదీశ్వరి, సిరసపల్లి నాని, కో ఆప్షన్ కౌన్సిలర్ షేక్ రోజా, లగుడు స్వామి, వైసిపి మహిళ విభాగం టౌన్ అధ్యక్షరాలు గణమ్మ, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ నర్సింహమూర్తి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శారద, దనిమిరెడ్డి ప్రసాద్, నాగు పాల్గొన్నారు.