చట్ట బద్దత లేని మైనింగ్ వ్యాపారులపై చర్యలు: ఆర్‌డివో
ప్రజాశక్తి -గూడూరు : గూడూరు రూరల్ పరిసర ప్రాంతాల్లో చట్టబద్దత లేని మైనింగ్ వ్యాపారులపై ర్యలుతీసుకుంటామని ఆర్‌డివో కిరణ్‌కుమార్ హెచ్చ రించారు. శుక్రవారం విలేకరులతో మాట్లా డుతూ చట్టబద్దత లేని మైనింగ్ వ్యాపారుల సమాచారం ఒక మెసేజ్ పెడితే చాలు గూడూరు రూరల్ పరిసర ప్రాం తాల్లోనే తాను తిరుగుతుంటానని ఎక్కడ హిటాచిలు తవ్వుతూ కనిపిస్తే సీజ్ చేస్తామని హ్చెరించారు. అనుమతుల్లేని మైనింగ్ వ్యాపారులు జాగ్రత్తగా వుండాలని హ్చెరించారు. గూడూరు మండలంలోని అక్రమంగా గ్రావెల్ తెల్లరాయి ఎక్కడపడితే అక్కడ తవ్వి గుంతలు తవ్వుతున్నారని, వీటికి పర్మిషన్ లేకుండా వీళ్ళ ఇష్టానుసారం గుంతలు తవ్వి పర్యావరానికి ఇబ్బందికి గురి చేస్తున్నారని, ఈ విషయం ఆర్డీవో కిరణ్ కుమార్ దష్టికి వెళ్లడంతో ఆయన దీని మీద ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకున్నారు. అక్రమాలు జరుగు తుంటే అడ్డుకుని వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు.










