Jun 07,2023 19:49

కరపత్రాలు విడుదల చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - గోనెగండ్ల
ఈనెల 24న ఎమ్మిగనూరు పట్టణంలో జరిగే చర్మకారుల సంఘం ప్రథమ జిల్లా మహాసభను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ చర్మకార వృత్తిదారుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు ఎమ్‌డి.ఆనంద్‌ బాబు, మండల అధ్యక్షులు ఒంటెడుదిన్నె లోకన్న, కెవిపిఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు బి.కరుణాకర్‌ కోరారు. బుధవారం గోనెగండ్లలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వం ఇస్తామన్న కిట్లు దక్కించుకోవడంతో పాటు చర్మకారుల బతుకుల్లో సమూల మార్పు దిశగా ఉద్యమించి సాధించేందుకు, జిల్లా వ్యాప్తంగా ఉన్న చర్మకారులనంతా కూడగట్టి మరో సామాజిక ఉద్యమాన్ని నిర్వహించేందుకు 24న ఎమ్మిగనూరుకు అత్యధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు.