Oct 02,2023 21:25

సన్మానిస్తున్న దృశ్యం

సన్మానిస్తున్న దృశ్యం
చరిత్రకారులను మరువద్దు
ప్రజాశక్తి-నెల్లూరు అర్బన్‌:గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం జీవితాంతం కషి చేసిన గాంధీని ఎప్పటికీ భారతవని మర్చిపోదని శ్రీరామరాజు చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ పేర్నపాటి శ్రీరామరాజు పేర్కొన్నారు. శ్రీరామరాజు చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నెల్లూరు బి.వి.నగర్‌ లోని ట్రస్టు కార్యాలయం నందు జాతిపిత మహాత్మ గాంధీ 154 గాంధీ జయంతి- మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి ఘనంగా జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత చీదరాల చెన్నయ్య, ట్రస్టు సెక్రటరీ కె.మురళీ మోహన్‌ రాజు, కె.భరత్‌ కుమార్‌ రాజు, ట్రస్టు సభ్యులు రాజా రెడ్డి, ప్రభాకర్‌ రావు, కె.ఈశ్వరస్వామి, వెంకట్‌ రెడ్డి, బి.కష్ణ పాల్గొన్నారు.