ముంబయి : గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టిఎంసి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల కూటమిపై ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్‌పవార్ మంగళవారం స్పందించారు. కూటమి ఏర్పాటు ఇంకా చర్చల దశలోనే ఉందని అన్నారు. గోవాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశంపై మమతా బెనర్జీ, కాంగ్రెస్‌లతో తమ పార్టీ చర్చలు జరుపుతోందని శరద్‌పవార్ పేర్కొన్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, తమ పార్టీకి కేటాయించే సీట్లపై చాయిస్‌ను వారికే ఇచ్చామని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా, షెడ్యూల్ ప్రకారం గోవాలో వచ్చే నెల 14న పోలింగ్ జరగనుంది.










