Sep 04,2023 21:17

చర్చించేనా!


జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంపై అందరి దృష్టి నిలిచింది. ఉమ్మడి జిల్లాలోని కరువు కరాళ నృత్యం చేయడం దగ్గర నుంచి జిల్లా ప్రగతి ఏళ్ల తరబడి సాగుతున్న నేపథ్యం అందరికీ తెలిసిందే. కడప నగర రహదారుల విస్తరణ దగ్గర నుంచి రిమ్స్‌ సూపర్‌స్పెషాలిటీ భవన నిర్మాణ పనులు, ఆర్కిటెక్షర్‌ యూనివర్శిటీ ఏర్పాటు, ఉక్కు పరిశ్రమ పనుల్లో పురోగతి, కొప్పర్తి పైప్‌లైన్‌ పనుల నత్తనడక సాగుతున్న తీరుపై ప్రశ్నించడం కరువైంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్ష టిడిపి నుంచి పాలక పక్ష తప్పిదాలను నిలదీసే అవకాశాలు సన్నగిల్లిన నేపథ్యంలో సమగ్ర చర్చ దేవతావస్త్రంలా మారిన నేపథ్యంలో మంగళవారం జిల్లా పరి షత్‌ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో కథనం..ప్రజాశక్తి - కడప ప్రతినిధి
కడప, అన్నమయ్య జిల్లాల్లో కరువు కరాళ నృత్యం చేస్తోంది. పదేళ్లలో ఎన్నడూ లేని రీతిలో క్షామ పీడిత పరిస్థితులు నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది. కడపలో ఆరు రహదారుల విస్తరణ ఏళ్ల తరబడి సా...గుతోంది. కడప నగరంలోని ముంపు
ప్రాంతాల సంరక్షణకు ఉద్దేశించిన స్ట్రోమ్‌ డ్రెయిన్‌ పనుల్ని నిధుల కొరత వెక్కిస్తోంది. ఖరీఫ్‌ సీజన్‌ ముగియనున్న నేపథ్యంలో నాలుగింట ఒక వంతు మాత్రమే సాగుకు పరిమితం కావడం ఆందోళన కలిగిస్తోంది. కెసి కెనాల్‌కు నీటి విడుదలపై స్పష్టత కొరవడింది. రబీ సీజన్‌లో పంటల సాగులో కీలకమైన ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల కొరత తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమగ్రంగా చర్చించాల్సి ఉంది. అన్నమయ్య, గండికోట నిర్వాసితుల మొర, పింఛా, ఎల్‌ఎస్‌పి గేట్ల మరమ్మతులు, సర్వరాయసాగర్‌, బ్రహ్మసాగర్‌, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ పరిధిలోని లింగాల కాల్వ లీకేజీ, యురేనియం పైప్‌లైన్‌ పనుల పురోగతిపై ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంది. ముఖ్యమంత్రి జగన్‌ నిర్వాసితులను ఆదుకుంటామని హామీనిచ్చారు. ఇప్పటికీ హామీలో ఆశించిన పురోగతి కనిపించ లేదు. పింఛా, ఎల్‌ఎస్‌పి గేట్లకు మరమ్మతులు, సర్వరాయసాగర్‌, బ్రహ్మసాగర్‌ లీకేజీల పరిష్కారం, యర్రబల్లి-పార్నపల్లి పైప్‌లైన్‌ పనుల్లో ఆలస్యం కారణంగా యురేనియం నిర్వాసిత గ్రామాలకు తాగునీటి సమస్య ఎప్పటికి పరిష్కారమవుతుందో సమాధానం రాబట్టాల్సి ఉంది. ప్రతి ఏటా వర్షాకాలంలో వచ్చే వరదల నుంచి కడప ముంపు ప్రాంతాల పరిరక్షణపై దృష్టి సారించాల్సి ఉంది. గండికోట నిర్వాసితులకు రూ.ఏడు లక్షల పరిహారానికి అదనంగా మరో రూ.మూడు లక్షలను అందిస్తామని ఇచ్చిన హామీని నిలుపుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. కడప జిల్లా జీవనాడిగా మారిన ఉక్కు పరిశ్రమ ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేయడం సరే, పనుల పురోగతి కనిపించడం లేదు. జెఎస్‌డబ్ల్యూ సంస్థ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు పనులను ప్రారంభించారు. ఇప్పటివరకు ఆశించిన పురోగతి కనిపించలేదు. కొప్పర్తిలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన రూ.150 కోట్ల నీటి సరఫరా పైప్‌లైన్‌ ఏర్పాటు ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందో తెలియడం లేదు. ఫలితంగా జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వలసలు వెళ్తున్న సంగతి తెలి సిందే. ఇప్పటికైనా జిల్లా పరిషత్‌ పాలకవర్గం జిల్లా సమగ్రాభివృద్ధి అర్థ వంతమైన చర్చ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పడంలో సందేహంలేదు. ప్రాంతాల సంరక్షణకు ఉద్దేశించిన స్ట్రోమ్‌ డ్రెయిన్‌ పనుల్ని నిధుల కొరత వెక్కిస్తోంది. ఖరీఫ్‌ సీజన్‌ ముగియనున్న నేపథ్యంలో నాలుగింట ఒక వంతు మాత్రమే సాగుకు పరిమితం కావడం ఆందోళన కలిగిస్తోంది. కెసి కెనాల్‌కు నీటి విడుదలపై స్పష్టత కొరవడింది. రబీ సీజన్‌లో పంటల సాగులో కీలకమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల కొరత తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమగ్రంగా చర్చించాల్సి ఉంది. అన్నమయ్య, గండికోట నిర్వాసితుల మొర, పింఛా, ఎల్‌ఎస్‌పి గేట్ల మరమ్మతులు, సర్వరాయసాగర్‌, బ్రహ్మసాగర్‌, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ పరిధిలోని లింగాల కాల్వ లీకేజీ, యురేనియం పైప్‌లైన్‌ పనుల పురోగతిపై ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంది. ముఖ్యమంత్రి జగన్‌ నిర్వాసితులను ఆదుకుంటామని హామీనిచ్చారు. ఇప్పటికీ హామీలో ఆశించిన పురోగతి కనిపించ లేదు. పింఛా, ఎల్‌ఎస్‌పి గేట్లకు మరమ్మతులు, సర్వరా యసాగర్‌, బ్రహ్మసాగర్‌ లీకేజీల పరిష్కారం, యర్రబల్లి -పార్నపల్లి పైప్‌లైన్‌ పనుల్లో ఆలస్యం కారణంగా యురేనియం నిర్వాసిత గ్రామాలకు తాగునీటి సమస్య ఎప్పటికి పరిష్కారమవుతుందో సమాధానం రాబట్టాల్సి ఉంది. ప్రతి ఏటా వర్షాకాలంలో వచ్చే వరదల నుంచి కడప ముంపు ప్రాంతాల పరిరక్షణపై దృష్టి సారించాల్సి ఉంది. గండికోట నిర్వాసితులకు రూ.ఏడు లక్షల పరిహారానికి అదనంగా మరో రూ.మూడు లక్షలను అందిస్తామని ఇచ్చిన హామీని నిలుపుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. కడప జిల్లా జీవనాడిగా మారిన ఉక్కు పరిశ్రమ ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేయడం సరే, పనుల పురోగతి కనిపించడం లేదు. జెఎస్‌డబ్ల్యూ సంస్థ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు పనులను ప్రారంభించారు. ఇప్పటి వరకు ఆశించిన పురోగతి కనిపించలేదు. కొప్పర్తిలో పరిశ్రమల కు అవసరమైన రూ.150 కోట్ల నీటి సరఫరా పైప్‌లైన్‌ ఏర్పాటు ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందో తెలియడం లేదు. ఫలితంగా జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వలసలు వెళ్తున్న సంగతి తెలి సిందే. ఇప్పటికైనా జిల్లా పరిషత్‌ పాలకవర్గం జిల్లా సమగ్రాభివృద్ధి అర్థ వంతమైన చర్చ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పడంలో సందేహంలేదు.