Nov 13,2023 19:28

నిందితుని చూపుతున్న పోలీసులు

ప్రజాశక్తి - ఆదోని
ఆదోని శివారులోని సిరిగుప్ప చెక్‌ పోస్ట్‌ వద్ద ఐరన్‌ షాపు, పంజర్‌ పోల్‌ ఆంజనేయ స్వామి గుడి హుండీ దొంగతనాల కేసులో నిందితుని అరెస్టు చేసినట్లు వన్‌టౌన్‌ సిఐ విక్రమ సింహా తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడారు. ఆదోనిలోని బాలకొలను గుడి వద్ద వ్యక్తి సంచితో అనుమానాస్పదంగా కనిపించడంతో అతని పట్టుకొని విచారించినట్లు తెలిపారు. ఐరన్‌ షాపులో రూ.1.20 లక్షలు, హుండీ నుంచి రూ.6 వేలు, 15 తులాల వెండి ఛాతీ కవచం, కన్నులు, పాదాలను దొంగతనం చేసినట్లు అంగీకరించినట్లు చెప్పారు. రూ.1.10 లక్షల నగదు, వస్తువులు స్వాధీనం చేసుకొని ఆదోనిలోని బోయగేరికి చెందిన నరసింహులును అరెస్టు చేసి జ్యుడిషియల్‌ కస్టడీకి తరలించామన్నారు. హెడ్‌కానిస్టేబుల్‌ మద్దిలేటి, రంగస్వామి, లక్ష్మణ్‌, సుధీర్‌, ముస్తాక్‌, అశోక్‌ పాల్గొన్నారు.