Jul 17,2023 16:22
  • 3, కేజీల150 గ్రాములు గంజాయి స్వాధీనం

ప్రజాశక్తి - ముద్దనూరు : ముద్దనూరు కడప రహదారిలోని తిమ్మాపురం గ్రామం సమీపంలో ఉన్న డాబా వద్ద గంజాయి విక్రయిస్తున్న గంగారామ్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు సిఐ నరేష్ బాబు తెలిపారు. సోమవారం స్థానిక పోలీసు స్టేషన్ వద్ద సిఐ  మాట్లాడుతూ మండలం లోని తిమ్మాపురం గ్రామం సమీపం వద్ద రాజస్థాన్ కు చెందిన రంగారామ్, హీరారామ్ కలిసి డాబా నిర్వహిస్తున్నారు. వీరిలో ఒకరైన రంగారామ్ డాబా వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు చెప్పారు. సిఐ నరేష్ బాబు, ఎస్ఐ చంద్ర మోహన్ కలిసి సిబ్బందితో వెళ్లి దాడి చేసి గంజాయి విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అతని వద్ద నుండి దాదాపు 3 కేజీల150 గ్రాముల గంజాయి స్వాదీనం చేసుకున్నట్లు చెప్పారు. రాజస్థాన్ కు చెందిన విజయా చౌదరీ ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి డాబా నిర్వాహకులకు విక్రయించినట్లు చెప్పారు. వీరు ఇక్కడ లారీ డ్రైవర్లకు విక్రయిస్తున్నట్లు చెప్పారు.హీరారామ్, విజయా చౌదరీ పరారీలో ఉన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ముద్దనూరు స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో ఇన్స్ పెక్టర్ చెన్నారెడ్డి పాల్గొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.