Aug 24,2023 21:25

వల్లూరు యాదాల శేషగిరి పాఠశాలలో విద్యార్థుల సంబరాలు

పోరుమామిళ్ల టౌన్‌ : పోరుమామిళ్లలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నరేష్‌ ఆధ్వర్యంలో గురువారం భౌతిక శాస్త్ర విభాగం పర్యవేక్షణలో చంద్రయాన్‌ - 3 విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ చంద్రయాన్‌ - 3 విజయవంతం కావడంతో భారత్‌ దేశ కీర్తి మరొక్కసారి ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిందని తెలిపారు. వైస్‌ ప్రిన్సిపల్‌ ప్రకాష్‌ రావు మాట్లాడుతూ చంద్రయాన్‌ - 3 విజయం వెనుక ఇస్రో శాస్త్రవేత్తల కషిఎంతో గర్వించదగినదని తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీధరమూర్తి, బాబు రవిచంద్ర, మల్లికార్జున, కళాశాల అధ్యాపక, అధ్యపకేతర సిబ్బంది, విధ్యార్థులు పాల్గొన్నారు. వల్లూరు : భారత ప్రతిష్టను చంద్రయాన్‌ -3 చాటిందని యాదాల శేషగిరి మెమోరియల్‌ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాల కరస్పాండెంట్‌ వంకదారి ఆంజనేయులు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని యాదాల శేషగిరి మెమోరియల్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో విద్యార్థులు అందరూ జాతీయ జెండాలు రెపరెపలాడిస్తూ ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్‌ ఆంజనేయులు మాట్లాడుతూ చంద్రయాన్‌-3 చరిత్ర సష్టించింది అన్నారు. జాబిల్లిపై ఇప్పటివరకు ఏ దేశం దిగని దక్షిణ ధ్రువం పై విక్రమ్‌ ల్యాండర్‌ కాలుమోపి భారతదేశంలోనే చరిత్రలో నిలిచిందన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఏవో ఉత్తమ రెడ్డి ,పాఠశాల ఉపా ధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అట్లూరు : చంద్రయాన్‌-3 విజయం ప్రతి భారతీయునికీ గర్వకారణం కారణమని ఎంఇఒ ఖాదర్‌వలి పేర్కొన్నారు. స్థానిక అట్లూరు జిల్లాపరిషత్‌ ఉన్నతపాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు జెండాను ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. అట్లూరులో