Aug 27,2023 22:21

ప్రజాశక్తి - ఉండి
             చంద్రయాన్‌-3 విజయవంతం కావడంతో ఉండిలోని స్వాతంత్య్ర సమరయోధుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చంద్రయాన్‌ విజయయోత్సవ ర్యాలీని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి వరదరాజు, కాగిత మాతయ్య, విశ్రాంత జవాన్‌, కలిసిపూడి ఎంపిటిసి సభ్యులు దంగేటి రామలింగేశ్వరరావు మాట్లాడుతూ చంద్రయాన్‌-3 విజయవంతం కావడం భారతదేశం గర్వించదగ్గ విషయమన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇస్రో శాస్త్రవేత్తలు ఎన్నో కష్టాలు పడి చంద్రయాన్‌-3 సిద్ధం చేశారన్నారు. వారు పడ్డ కష్టానికి ప్రతిఫలం లభించిందన్నారు. చంద్రమండలం దక్షిణ ధ్రువల్లో మొట్టమొదటిసారిగా భారత జాతీయ జెండా రెపరెపలాడిందన్నారు. దీనికి కారకులైన ఇస్రో శాస్త్రవేత్తలకు, భారత ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.