Aug 24,2023 20:54

ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు

ప్రజాశక్తి - మంత్రాలయం
చంద్రయాన్‌ - 3 విజయవంతంపై విద్యార్థులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి, 'జయహో భారత్‌, జయహో ఇస్రో' అంటూ నినాదాలు చేశారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణంలో ప్రధానోపాధ్యాయులు హంపయ్య ఆధ్వర్యంలో రాఘవేంద్ర సర్కిల్‌ మీదుగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఫలించి చంద్ర మండలంలో దక్షిణ భాగంలో చంద్రయాన్‌-3 విజయవంతంగా చేరడం దేశానికే గర్వకారణమని ప్రధానోపాధ్యాయులు హంపయ్య కొనియాడారు.