ప్రజాశక్తి-బాపట్ల: భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో సాయుధ పోరాటంలో ఆంగ్లేయుల గుండెల్లో సింహస్వప్నమైన చంద్రశేఖర్ ఆజాద్ గొప్ప పోరాట యోధుడని ఫోరం ఫర్ బాపట్ల కార్యదర్శి పిసి సాయిబాబు అన్నారు. సోమవారం చంద్రశేఖర్ ఆజాద్ 92వ జయంతి సందర్భంగా బాపట్ల పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాల వద్ద గల ఆజాద్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. లాహౌర్ అసెంబ్లీపై బాంబు దాడి, కకోరి రైలు దోపిడీ వంటి చర్యల ద్వారా బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. బ్రిటిష్ పోలీసులు చుట్టుముట్టగా తనను తాను కాల్చుకొని ఆజాద్ అమరడయ్యాడని పేర్కొన్నారు. పిన్న వయసులో దేశం కోసం ఆయన చేసిన త్యాగం నిరుపమానమని కొనియడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే భారత జాతి ఆజాద్‌కు అందించే నిజమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు జమృద్ బాషా, తమలపాకుల భాస్కరరావు పాల్గొన్నారు.










