Jul 24,2022 23:26

టిడిపి సభ్యత్వ నమోదులో కోరాడ రాజబాబు

ప్రజాశక్తి -పిఎం పాలెం : జివిఎంసి 7వ వార్డు పరిధి చంద్రంపాలెంలో వార్డు టిడిపి అధ్యక్షులు పిల్ల నర్సింగరావు ఆధ్వర్యాన ఆదివారం సభ్యత్వ నమోదును చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పార్టీ భీమిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ కోరాడ రాజబాబు హాజరై మాట్లాడారు. పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ తప్పనిసరిగా సభ్యత్వ నమోదు చేసుకోవాలని కోరారు. దీని వల్ల రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు. కార్యకర్తలంతా నిత్యం ప్రజలతో ఉండి ప్రభుత్వ విధానాలను ఎండగట్టి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వాణిజ్య విభాగ కార్యవర్గ సభ్యుడు పిల్ల వెంకట్రావు, 7వ వార్డు ప్రధాన కార్యదర్శి కనూరి అచ్యుతరావు, నాయకులు నాగోతి సూర్యప్రకాష్‌, పిల్ల రాము, పోతిన సోంపాత్రుడు, పోతిన నాయుడు, పోతిన బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
జివిఎంసి ఆరో వార్డు పరిధి రిక్షా కాలనీలో టిడిపి వార్డు అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్‌ ఆధ్వర్యాన సభ్యత్వ నమోదు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్‌ ఉపాధ్యక్షుడు గొల్లంగా ఆనందబాబు, కార్యదర్శి నాగేశ్వరరావు, బిసి సెల్‌ అధ్యక్షుడు రెడ్డి సత్యనారాయణ, మహిళా అధ్యక్షులు బబ్బెలు, తెలుగు యువత సభ్యులు పోతిన రఘు, నక్క రమణ, పిల్లా కృష్ణ, రెడ్డి చిన్న, నాయకులు గొలగని సన్యాసిరావు, బల్ల బలరాంమూర్తి, సర్వ దేవుళ్లు పాల్గొన్నారు.