Jul 12,2023 23:37

మైదానం పరిశీలిస్తున్న ఇంజినీరింగ్‌ అధికారులు

ప్రజాశక్తి- పిఎం పాలెం : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక మంది విద్యార్థులున్న చంద్రంపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మైదాన సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు చొరవతో నిధులు మంజూరయ్యాయి. వర్షం పడితే చెరువును తలపించేలా నీరు నిలిచిపోతున్న మైదాన సమస్యపై ఎమ్మెల్యే దృష్టికి తేగా, రూ.ఐదు లక్షలు మంజూరు చేసారు. ఈ నిధులతో చేపట్టే పనులపై పరిశీలనకు బుధవారం నాడు-నేడు పనుల నిర్వహణ అధికారులు ఇఇ ఉప్పలపాటి సత్యనారాయణ ఎఇ పల్లా నాగ సత్యనారాయణ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చంద్రంపాలెం పాఠశాల క్రీడామైదానంలో నిలిచిపోతున్న నీటిని తొలగించేందుకు మైదానంలో చుట్టుపక్కల ఆరుఅడుగుల లోతులో ఆరు ఇంకుడు గుంతలను నిర్మించి, తద్వారా ఈ సమస్యను పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. హెచ్‌ఎం ఎం రాజబాబు, పోతిన ప్రసాద్‌, తల్లిదండ్రుల కమిటీ ఛైర్మెన్‌ బుడుమురు మీన, కోఆప్షన్‌ సభ్యులు పిళ్లా సూరిబాబు పాల్గొన్నారు.