Nov 11,2023 20:54

పాలకొల్లు కళాకారుల సంతాపం
ప్రజాశక్తి - పాలకొల్లు

              విభిన్న పాత్రలు అలవోకగా పోషించిన సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ ఆకస్మిక మృతిపై పాలకొల్లులోని కళాకారులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. శతాధిక దర్శకుడు కోడి రామకృష్ణ సారధ్యంలోని లలిత కళాంజలి జాతీయ నాటక పరిషత్‌ 1995లో చంద్రమో హన్‌ను పాలకొల్లులో ఘనంగా సత్కరించింది. చంద్రమో హన్‌ లేరంటే నాడు ఆయన సన్మానంలో పాల్గొన్న సీనియర్‌ కళాకారులు మానాపురం సత్యనారాయణ, వంగా నరసింహ రావు, తాళాబత్తుల వెంకటేశ్వరరావు, మేడికొండ శ్రీనివాస్‌, గుడాల హరిబాబు, కెవి.కృష్ణవర్మ, వీరాసత్యం, కొటికలపూడి కృష్ణ, నీలంశెట్టి సత్యప్రసాద్‌ నమ్మలేకపోతున్నారు. అనేక పాత్రలను అలవోకగా నటించిన చంద్రమోహన్‌ నాడు సామాన్య కళాకా రులతో స్నేహభావంతో ఉన్నా రని చెబుతు న్నారు. ఆయనతో నటించిన హీరోయి న్‌లు చిత్ర పరిశ్ర మలో అగ్రగామిగా ఉన్నారని గుర్తు చేశారు. 1984-85 సంవత్స రంలో ఆయన ఇక్కడకు సమీ పంలోని పోడూరులో నాలుగిళ్ల చావిడి సినిమా షూటింగ్‌ పాల్గొన్నారు. రావుగోపాలరావుతో పాటు పలువురు సినీ నటులు పక్షం రోజులుగా పోడూరులో ఉన్నారు. నాటి సినిమా షూటింగ్‌ విశేషాలను సీనియర్‌ నటులు జ్ఞాపకం చేసుకుంటుంన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పదహారేళ్ల వయసు చిత్రాన్ని రాజమండ్రి, కొవ్వూరు, పోలవరంలో చిత్రీకరించారు. నాడు చిత్ర షూటింగ్‌ కోసం వెళ్లిన వారు చంద్రమోహన్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.