Jun 22,2023 20:49

రమేష్‌కుమార్‌రెడ్డికి స్వాగతం పలుకుతున్న టిడిపి నాయకులు, కార్యకర్తలు

చిన్నమండెం : రాష్ట్రం అభివద్ధి చెందాలంటే టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్ర బాబుతోనే సాధ్యమని నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే ఆర్‌.రమేష్‌ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని దేవగుడిపల్లె పంచాయతీలో ఇదేంఖర్మ రాష్ట్రానికి, బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి అభివృద్ధి, సంక్షేమం కోసం వచ్చే ఎన్నికల్లో టిడిపికి అండగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా రమేష్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ సిఎం జగన్‌ ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారాన్ని చేజిక్కించుకొని రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చారన్నారు. రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న బిసిలకు కార్పొ రషన్లు ఏర్పాటు చేస్తానని హామీనిచ్చి కార్పొరేషన్‌లను ఏర్పాటు చేసి ఉండ డానికి కార్యాలయం, కూర్చోవడానికి కుర్చీ కానీ, బాధలు తీరేదానికి నిధులు గాని విధులు విడుదల చేయ కుండా బిసిలకు తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. టిడిపి హయాంలో బిసిల కోసం ఆదరణ, ముందడుగు ,చేయూత వంటి అనేక పథకాలతో పాటు స్టడీ సర్కిల్స్‌, విదేశీ విద్య వంటి అనేక కార్య క్రమాలను చేపట్టి రాష్ట్ర అభివద్ధికి దోహద పడ్డామని అన్నారు. టిడిపి అధి కారంలో ఉన్నప్పుడు బిసి, ఎస్‌సి, కాపు, ఎస్‌టి, మైనార్టీలకు సబ్సిడీ పథకా లను ఏర్పాటుచేసిన టిడిపికే దక్కుతుందన్నారు. ఆడబిడ్డలకు ఈ రాష్ట్రంలో రక్షణ కరువై పోయిం దన్నారు. చదువు కున్న యువకులు ఉద్యోగాలు రాక గంజాయి, గుట్కా, మద్యానికి బానిసవుతున్నారని పేర్కొన్నారు. కార్య క్రమంలో మండల అధ్యక్షులు బెల్లం నరసింహారెడ్డి, హరి అమర్నాద్‌రెడ్డి ,దిలీప్‌ కుమార్‌రెడ్డి, రమణారెడ్డి, కరు ణాకర్‌, వెంకట్‌ శివ, వెంకటస్వామి, నాగభూషణ, వెంకటరమణ, పెద్ధయ్య, రమణ, సురేంద్ర, గౌరీ పాల్గొన్నారు.