Aug 17,2023 19:35

ఇంటింటి ప్రచారం చేస్తున్న మహిళలు

ఇంటింటి ప్రచారం చేస్తున్న మహిళలు
చంద్రబాబుతోనే భవిష్యత్తు
ప్రజాశక్తి-జలదంకి:రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల భవిష్యత్తు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతోనే సాధ్యం అవుతుందని మహాశక్తి మహిళలు మహిళ సోదరీమణులకు తెలియజేశారు. గురువారం మండలంలోని బోయలపాడు గ్రామంలో టిడిపి ఆధ్వర్యంలో మహాశక్తి మహిళలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళ శ్రేయసే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు ఎంతో ముందు చూపుతో రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి పథకాలను రూపొందించిందన్నారు. 2024లో జరిగే ఎన్నికలలో ఉదయగిరి ఎమ్మెల్యేగా బొల్లినేని వెంకట రామారావుని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడుని గెలిపించాలన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రతి సంవత్సరం 1,22,000 విలువైన సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికీ అందజేయడం జరుగుతుందని తెలియజేశారు.
వచ్చే ఎన్నికలలో టిడిపికి ఓటు వేసి అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ టిడిపికి అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో మహాశక్తి సభ్యులు నూతలపాటి జయలక్ష్మి, కట్ట పద్మావతి, పల్లా రాజేశ్వరి, పచ్చ మనీషా చౌదరి, మొక్క సుజాత, మేదరమెట్ల ప్రశాంతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.