
చంద్రబాబుతోనే భావితరాలకు భవిష్యత్
ప్రజాశక్తి-ఉదయగిరి : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతోనే భావితరాల భవిష్యత్తు సాధ్యమని టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి, మాజీ జెడ్‌పి చైర్మన్ చెంచలబాబు యాదవ్ పేర్కొన్నారు. గురువారం స్థానిక కావలి రోడ్డు ఎస్‌టి కాలనీలో బాబు ష్యూరిటీ - భవిష్యత్తు గ్యారెంటీ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావితరాల పిల్లలకు, రాష్ట్రానికి భవిష్యత్ గ్యారెంటీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేదని, అది ఒక్క నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. పేదవాడిని ధనేకుడిని చేసే సత్తా చంద్రబాబుకు ఉందని, రాష్ట్రం రూ.13 లక్షల కోట్లతో అప్పుల ఊబిలో నెట్టి సంక్షేమం అభివృద్ధిని మరిచిన ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఈనాటికీ కాలనీల్లో టిడిపి చేపట్టిన రహదారులు గృహాలు దర్శనమిస్తున్నాయి తప్ప ఈ ప్రభుత్వంలో చేపట్టిన ఏ ఒక్క అభివృద్ధి కనపడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు ప్రలోభాలకు గురవ్వదన్నారు. సంక్షేమం పేరుతో నిత్యావసర వస్తువులు పెట్రోలు, గ్యాస్, కరెంట్ ధరలు 6 నుండి 9 దఫాలుగా అధిక రేట్లను పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి 2024లో తగిన బుద్ధి చెప్పాలని రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఉదయగిరి మరింతగా అభివృద్ధి చెందాలన్నా చంద్రబాబు నాయుడు, మాజీ ఎంఎల్‌ఎ బొల్లినేని వెంకట రామారావు గెలిపించుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ చింతనబోయిన బయన్న, మైనార్టీ నాయకులు రియాజ్ ఓబుల్ రెడ్డి, బొజ్జ నరసింహులు, రాజా నాయుడు, స్థానికులు పాల్గొన్నారు.