Nov 08,2023 00:44

ప్రజాశక్తి - పంగులూరు
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ది సాధ్యమని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్  అన్నారు. మండలంలోని నూజిల్లపల్లిలో బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి మహిళలు, యువతతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. టిడిపి అధికారంలోకి వస్తే అమలు చేయబోయే సంక్షేమ పథకాలు మహాశక్తి, యువగళం, అన్నదాత, ఇంటింటికీ నీరు, పూర్ టు రిచ్, బీసీ రక్షణ చట్టం గురించి వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. చంద్రబాబు మహానాడు వేదికగా ఇటీవల ప్రకటించిన పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాలని సూచించారు. చంద్రబాబు ప్రకటించిన హామీలు ఎలా సాధ్యంమని వైసిపి నేతలు వక్రభాష్యం చెబుతున్నారని అన్నారు. జగన్‌రెడ్డి లాగా అప్పులతో కాకుండా పరిశ్రమలు స్థాపించి, సంక్షేమం, అభివృద్ధి రెండు ముందుకు తీసుకు వెళ్తారని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ రంగ సమస్యలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని అన్నారు. వైసిపి పాలనలో 8సార్లు విద్యుత్ చార్జీలు పెంచి సామాన్యులపై మోయలేని భారం వేపిన జగన్‌రెడ్డికి పాలించే అర్హత లేదని అన్నారు. టిడిపి ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని చెప్పారు. దళితుల సంక్షేమాన్ని జగన్‌ గాలికి వదిలేశారని అన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్‌ ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు. కార్యక్రమంలో నూజిలపల్లి మాజీ సర్పంచ్ గొట్టిపాటి వెంకటరత్నకుమారి, టిడిపి మండల అధ్యక్షులు రావూరి రమేష్, మాజీ జెడ్పిటిసి కర్రీ వెంకట సుబ్బారావు, టిడిపి మాజీ మండల అధ్యక్షులు కుక్క పల్లి ఏడుకొండలు, చింతల సహదేవుడు, గొట్టిపాటి ఖాజా స్వామి, పెంట్యాల రామలింగస్వామి, బెల్లంకొండ దశరథ పాల్గొన్నారు.