Aug 04,2023 23:47

ప్రజాశక్తి-యంత్రాంగం చిత్తూరులో చంద్రబాబు యాత్రను అడ్డుకుని దాడికి దిగడం పట్ల టిడిపి శ్రేణులు శుక్రవారం పలుచోట్ల నిరసనలు చేపట్టారు. కోటనందూరు తుని, నర్సీపట్నం రోడ్డులో టిడిపి తుని నియోజకవర్గ ఇన్‌ఛార్జి యనమల దివ్య, పార్టీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి యనమల కృష్ణుడు నిరసన తెలిపారు. పోల్నాటి శేషగిరిరావు, సుర్ల లోవరాజు, మోతుకూరి వెంకటేష్‌, వంగలపూడి బుజ్జి, గాది వరహాలుబాబు, చింతంనీడి అబ్బాయి పాల్గొన్నారు. ఏలేశ్వరం సి.రాయవరం రహదారిపై టిడిపి శ్రేణులు బైఠాయించారు. నియోజకవర్గ ఇన్చార్జి పరుపుల సత్యప్రభ మాట్లాడారు. జ్యోతుల పెదబాబు, సూది బూరయ్య, బస ప్రసాద్‌, మూదీ నారాయణస్వామి, పలివెల శ్రీనివాస్‌, ప్రజలు ఉన్నారు. సామర్లకోట రూరల్‌ నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్‌, బలుసు వాసు, కంటే జగదీష్‌ మోహన్‌, పైణ్ణి శ్రీనివాసరావు, సానిపిని వెంకటరావు, కాళ్ల రవీంద్ర, కురుకూరి సోమేశ్వరరావు, నిమ్మకాయల కిరణ్‌, గొర్రెల జయలక్ష్మి పాల్గొన్నారు. జగ్గంపేట రూరల్‌ జె.కొత్తూరులో జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో కాగడాలతో నిరసన చేపట్టారు. ఎస్‌విఎస్‌.అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, పైడిపాల సూరిబాబు, బద్ది సురేష్‌ సైనం శ్రీను పాల్గొన్నారు.