ప్రజాశక్తి-కుప్పం: అక్రమ అరెస్టు నుంచి చంద్రబాబు విడుదల కావాలని కుప్పంలోని తిరుపతి గంగమ్మ ఆలయంలో ఆదివారం కృష్ణదేవరాయ బలిజ సం ఘం నేతలు పూజలు చేశారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు రావాలని అమ్మవారిని వేడు కుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మాజీ మా ర్కెట్ కమిటీ చైర్మన్ సత్యేంద్రర శేఖర్, మనీ, గోపి, రవి, కౌన్సిలర్ సోము తదితరులు పాల్గొన్నారు.
వెదురుకుప్పం: చంద్రబాబు నిర్దోషిగా బయటకు రావాలంటు మసీదులో మండలంలోని తాటిమాకులపల్లి మసీదులో ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో లోకనాథరెడ్డి, మోహన్‌మురళి, చంద్రబాబురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బంగారుపాళ్యం: అరెస్టులతో పోరా టాలు ఆపలేరని మాజీ సింగల్ విండో అధ్యక్షులు హేమ చంద్రనాయుడు అన్నారు. ఆదివారం మం డల కేంద్రంలోని టిడిపి కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. జనార్దన్‌గౌడ్, లోకనాథం నాయుడు, కమల్నాదిరెడ్డి, అమర్నాథ్ పాల్గొన్నారు.
వికోట: వీకోటలో టిడిపి నాయకలు చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ పాలక పక్షాన్ని ప్రశ్నిస్తే సంకెళ్లా అనే కార్య క్రమాన్ని నిర్వ హించారు. కార్యక్రమంలో రంగనాథ్, ఈశ్వర్, ధీర జ్, శబరీష్, రాము, నారాయణస్వామి ఉన్నారు.
గంగాధరనెల్లూరు: మండల కేంద్రంలో టిడిపి నేతలు చంద్రబాబు అరె స్టును వ్యతిరేకిస్తూ పాలకపక్షాన్ని ప్రశ్నిస్తే సంకెళ్లా అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం చేతికి తాడులు కట్టుకొని నిరసన తెలియజేశారు. స్వామి దాస్, శ్రీధర్‌యాదవ్, క్రిష్ణమ నాయుడు, దేవ సుందరం తదిరులు పాల్గొన్నారు.
యదమరి: మండలంలోని దళవాయి గ్రామంలో టిడిపి కన్వీనర్ మొరార్జి ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన తెలిపారు.










