Sep 28,2023 22:04

పుట్టపర్తిలో ఉరితాళ్లు వేసుకుని నిరసన వ్యక్తం చేస్తున్న పల్లె, తదితరులు

ప్రజాశక్తి చెన్నేకొత్తపల్లి : చంద్రబాబు నాయుడు అరెస్టుపై అందరికంటే ఎక్కువగా బీసీలు తీవ్రంగా స్పందిస్తున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో గురువారం జరిగిన రిలే దీక్షల్లో వాల్మీకులు పాల్గొన్నారు. ప్రభుత్వ తీరుపై వాల్మీకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరిటాల సునీత పాల్గొని వాల్మీకులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో వాల్మీకులంతా వైసిపి నాయకులకు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెబుతారని అన్నారు.
ధర్మవరం టౌన్‌ : చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును రాష్ట్రమంతా వ్యతిరేకిస్తున్నారనితెలుగు మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు ముత్తుకూరు బీబీ అన్నారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ 16వ రోజు గురువారం తెలుగుమహిళలు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణంలో పలువురు వారి దీక్షకు మద్దతు తెలుపుతూ సంతకాలు చేశారు.
అగళి : చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ మండల కేంద్రమైన అగళి లో గురువారం మాజీ ఎమ్మెల్యే ఈరన్న ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. కళ్లకు గంతలు కట్టుకొని రిలే నిరాహారదీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
పెనుకొండ : జగన్‌ కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని టీడీపీ జిల్లా అధ్యక్షులు బికె.పార్థసారథి పేర్కొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు కి నిరసనగా గురువారం పట్టణంలోని అంబేద్కర్‌ సర్కిల్‌లో బికె. పార్థసారథి ఆధ్వర్యంలో 16 వ రోజు అర్ధ నగంగా సామూహిక రిలే నిరాహార దీక్ష చేపట్టారు.ఈ సందర్బంగా పార్థసారథి మాట్లాడుతూ న్యాయస్థానాలపై తమ కు పూర్తి నమ్మకం ఉందని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తొందరలోనే బయటకు వస్తారని అన్నారు..ఈ రిలే నిరాహార దీక్షకు సిపిఐ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కురుబ కృష్ణమూర్తి, చిన్న వెంకటరాముడు, శ్రీనివాసులు, రామలింగ, రఘు వీర, అశ్వర్థనారాయణ, హుజూర్‌, సిద్ధయ్య, సిద్దలింగప్ప తదితరులు పాల్గొన్నారు.
మడకశిర: చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ నియోజకవర్గ పరిధిలోని కళ్ళు మరి గ్రామంలో గురువారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇంచార్జ్‌ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. రిలే నిరాహారదీక్ష కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పరిటాల సునీత నియోజకవర్గ ఇంచార్జ్‌ గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ శ్రీనివాసమూర్తి, రాష్ట్ర డిఎన్‌టియుసి కార్యదర్శి గురుమూర్తి, మండల కన్వీనర్లు లక్ష్మీనారాయణ, మద్దనకుంటప్ప, దాసిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు మనోహర్‌, రామగిరి కన్వీనర్‌ సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.
పెనుకొండ : రాష్ట్రంలో మైనార్టీలకు అన్యాయం చేసిన వ్యక్తి జగన్‌ మోహన్‌ రెడ్డి అని టీడీపీ రాష్ట్ర నాయకులు జకీవుల్లా పేర్కొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసన అనంతపురం పట్టణంలోని దర్గా వద్ద నుండి పెనుకొండ బాబయ్య స్వామి దర్గా వరకు అనంతపురం మాజీ ఎంపీ సైఫుల్లా కుమారుడు జకీవుల్లా చేపట్టిన పాదయాత్ర నాలుగవరోజు పెనుకొండకు చేరుకుంది.ఈ సందర్బంగా పట్టణంలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద జకీవుల్లా కు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ ఘన స్వాగతం పలికారు. అనంతరం దర్గా వరకు పాదయాత్ర చేపట్టి బాబయ్య స్వామి కి పూలచాదర్‌ను సమర్పించి దర్గా లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌బాషా, టీడీపీ రాష్ట్ర నాయకులు కె. లక్ష్మిపతి, మురళి రాయల్‌, చంద్ర దండు ప్రకాష్‌ నాయుడు, వెంకటేశ్వరరావు, కష్ణకుమార్‌, నాగేంద్ర, ప్రకాష్‌, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.
పుట్టపర్తి అర్బన్‌ : చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ టిడిపి కార్యాలయం ముందు ఆ పార్టీ శ్రేణులు మెడకు ఉరితాల్లు బిగించుకుని నిరసన తెలిపారు. టిడిపి శ్రేణులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారానికి 17వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి, నాయకులు మెడకు ఉరి తాళ్లు బిగించుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అనంతరం పల్లె మాట్లాడుతూ చంద్రబాబును కుట్రపూరితంగా వైసిపి ప్రభుత్వం అరెస్టు చేయించిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మహమ్మద్‌ రఫీ, సామకోటి ఆదినారాయణ, ఎల్‌ఐసి నరసింహులు, పుల్లప్ప, శ్రీనివాసులు, లావణ్య, మాధవి తదితరులు పాల్గొన్నారు.
కదిరి టౌన్‌ : చంద్రబాబు నాయుడు వెన్నంటే బీసీ కులాలు ఉన్నాయని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జికందికుంట వెంకటప్రసాద్‌ అన్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ కందికుంట ఆధ్వర్యంలో కదిరి పట్టణంలో మున్సిపల్‌ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 18వ రోజు కొనసాగాయి. మేము సైతం బాబుతో అంటూ కదిరి నియోజకవర్గం కల్లు గీత కార్మికులు గౌడ సంఘం ఆధ్వర్యంలో శిబిరం వద్దకు చేరుకొని సంఘీభావం ప్రకటించారు. ఈకార్యక్రమంలో ఈడిగ, కల్లుగీత, గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ముదిగుబ్బ : చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి టిడిపి నాయకులు మండలకేంద్రంలో పర్యటించారు. క్లస్టర్‌ ఇన్‌ఛార్జి తుమ్మల మనోహర్‌, చికెన్‌ తిరుపాలు, బాసినేని లక్ష్మీనారాయణ, గడ్డం మోహన్‌, గోనుగుంట్ల రామాంజనేయులు, ఉత్తమ నాయుడు, రియాజ్‌, రాధమ్మ, గంగిరెడ్డిపల్లి నాయుడు, ప్రతాప్‌, కొలసాని చంద్ర, స్టూడియో అశోక్‌ , గోపాల్‌, నాగార్జున, రెడ్డప్ప, వెంకటపతి, మరియు తెలుగు ప్రొఫెషనల్‌ వింగ్‌ సభ్యుడు సురేంద్ర తదితరులుజీ కార్యక్రమంలో పాల్గొన్నారు
బుక్కపట్నం : చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి సత్య సాయి జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, మండల కన్వీనర్‌ మల్లిరెడ్డి,ఎస్సీ సెల్‌ నియోజవర్గ అధ్యక్షులు యశోద రాయుడు, తెలుగు మహిళా అధ్యక్షులు లావణ్య గౌడ్‌ , నాయకులు వెంకట రాముడు, బాలు, సయ్యద్‌ బాషా తదితరులు పాల్గొన్నారు.