Sep 12,2023 21:22

నెల్లిమర్ల: నిరసన తెలుపుతున్న మహిళా నాయకులు

ప్రజాశక్తి - నెల్లిమర్ల : టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును వెంటనే విడుదల చేయాలని టిడిపి జిల్లా మహిళా అధ్యక్షులు సువ్వాడ వనజాక్షి డిమాండ్‌ చేశారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టిడిపి మహిళా నేతలు మంగళ వారం మండల కేంద్రంలోని దుర్గాదేవి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించి చంద్రబాబును అరెస్టు చేశారన్నారు. స్కిల్‌ డెవలప్మెంట్‌ స్కాం కేసులో చంద్రబాబుని ఇరికించి అరెస్టు చేయడం దారుణమన్నారు. ఈ కేసు 2021లో ముగిసిందని ఆ కేసులో చంద్రబాబు పేరు కూడా లేదని వైసిపి ప్రభుత్వం అక్రమంగా ఇరికించి అన్యాయంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా జైల్లో వేశారని ఆరోపించారు. వైసిపి చేస్తున్న అక్రమ పాలనపై టిడిపి పోరాటం చేస్తుంటే ఓర్వలేక అక్రమ కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా వైసిపి ప్రభుత్వం చేసిన తప్పులు ఒప్పుకోని చంద్రబాబుని వెంటనే విడుదల చేయాలని డిమండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షులు బైరెడ్డి లీలావతి, మహిళా నేతలు బొంతు ఉమా, కోట్ల సునీత, లెంక హైమావతి, కింతాడ కళావతి, ముడు మంచి లక్ష్మీ, నరవ రామలక్ష్మీ, పొడుగు కృష్ణ వేణి, కాళ్ళ సత్యవతి, చందక గౌరి తదితరులు పాల్గొన్నారు.
వేపాడ: మండలంలోని పలు గ్రామాల్లో శివాలయాలు, రామాలయాల వద్ద మంగళవారం టిడిపి మహిళా నాయకులు చంద్రబాబును విడుదల చేయాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపికి చెందిన మహిళా సంఘాల నాయకులు, పాల్గొన్నారు.