- వైసిపి నాలుగేళ్ల పాలన సభలో మంత్రి దాడిశెట్టి రాజా
ప్రజాశక్తి - తుని
చంద్రబాబు కల్లబొల్లి మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన నాలుగు సంవత్సరాల పూర్తయిన సందర్భంగా తుని పట్టణంలో వైయస్సార్ విగ్రహానికి పూలదండ వేసి , కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి రాజా మాట్లాడుతూ చంద్రబాబు మహానాడులో ప్రకటించిన మేనిఫెస్టో కల్లబొల్లి మాటలని, గతంలో ముఖ్యమంత్రి చేసినప్పుడు అక్క చెల్లెమ్మలకు డ్వాక్రా రుణాలు, బంగారం రుణమాఫీ చేస్తానని హామీని నెరవేర్చలేదని ప్రజలకు గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లలో ఇచ్చిన హామీలను 85 శాతం నెరవేర్చారన్నారు. ప్రజా సంక్షేమం, పేద ప్రజల అభివృద్ధికి పథకాలు అందించి నందమూరి తారక రామారావు, కీ.శే. వైయస్ రాజశేఖర్ రెడ్డిలు ప్రజల మనసుల్లో స్థిర స్థాయిగా నిలిచార న్నారు. ఆ తర్వాత జగన్మో హన్ రెడ్డి ప్రజల మనసును గెలుచు కున్నారన్నారు. ఎన్‌టిఆర్ రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని ఎత్తివేసి, కేజీ 5 చేసిన ఘనుడు చంద్రబాబు అని ఆయన అన్నారు.నమ్మి ఓట్లు వేస్తే ప్రజలను నట్టేట ముంచేస్తాడని అన్నారు. కార్యక్రమంలో కోట నందూరు, తొండంగి, తుని రూరల్, పట్టణ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డు చైర్మన్ మాకినేడు బాబు, వైస్ చైర్మన్ వెలగా వెంకట కృష్ణజీ, ఎంపిపిలు లగుడు శ్రీనివాస్, బొప్పన రాము, రేలంగి రమణ గౌడ్, షేక్ క్వాజా, తుని మున్సిపల్ చైర్మన్ ఏలూరు సుధారాణి బాలు, పామర్తి మహేష్, జగటాల కోట సత్తిబాబు, గరిసింగు దొరబాబు పాల్గొన్నారు.
జడ్‌పి నాలుగేళ్ల పాలన సంబరాలు
కాకినాడ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఘనంగా సంబురాలు నిర్వహించారు. చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, సీఈవో ఎన్ వివి సత్యనారాయణ సారధ్యంలో కేకును కోసి ఉద్యోగులకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సూపరింటెండెంట్లు, ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు ఆర్.రమేష్, ఉద్యోగులు పాల్గొన్నారు.
తుని బహిరంగ సభలో మాట్లాడుతున్న మంత్రి రాజా










