Sep 13,2023 20:29

చాపాడు: రిలే నిరాహారదీక్షలకు సంఘీభావం తెలుపుతున్న లింగారెడ్డి

చాపాడు ; టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రజల కోసం నిత్యం పోరాడుతున్నాడని రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆయనకు పట్టం కడతారని ఆయనను నేరుగా ఎదుర్కొనలేక అక్రమ కేసులు బనాయించి వైసిపి ప్రభుత్వం కక్ష సాధింపుగా వ్యవహరిస్తుందని టిడిపి జిల్లా అధ్యక్షులు లింగారెడ్డి పేర్కొన్నారు. బుధవారం మైదుకూరులో టిడిపి నాయకులు తలపెట్టిన రిలే నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగుల అభ్యున్నతికి కషిచేసిన చంద్రబాబు నాయుడును ఆధారాలు లేకపోయినా అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు. టిడిపి కార్యకర్తలు ప్రతి గడపకు వెళ్లి వైసిపి అవినీతిని వివరించాలన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ధనపాల జగన్‌, దాసరి బాబు, మేకల బాబు, వైవి సుబ్బారెడ్డి, అన్నవరం సుధాకర్‌రెడ్డి, వెంకట సుబ్బయ్య, ప్రభాకర్‌, శ్రీను, రాకెట్‌ రఫీ కార్యకర్తలు పాల్గొన్నారు. జమ్మలమడుగు రూరల్‌ : చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి చదిపిరాళ్ళ భూపేష్‌ సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. కార్యక్రమంలో పెద్దముడియం మండలం నాయకులు మల్లారెడ్డి, కొండారెడ్డి, చెన్నారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి శ్రీకాంత్‌, శంకర్‌రెడ్డి, పుల్లారెడ్డి, చంద్ర, సుబ్బరాయుడు, గంగయ్య, జమాల్‌ భాష, బాలరాజు, మునిస్వామి, మస్తాన్‌ వల్లి, హుస్సేన్‌, బి.మహేష్‌, విజయ మోహన్‌ రెడ్డి, సామ్సావలి, మైలవరం మండల నాయకులు ప్రసాదు, అంకాల్‌, వెంకటేశ్వర్‌ రెడ్డి, ముని శంకర్‌, లక్ష్మీ నరసయ్య, జమ్మలమడుగు మండలం నాయకులు శంకర్‌, పొన్న తోట శ్రీనివాసులు కలరు. వీరికి సంఘీభావం మాజీ ఎమ్మెల్సీలు దేవగుడి నారాయణరెడ్డి, శివనాథ్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, సిపిఐ నాయకులు సంఘీభావం ప్రకటించారు. వేంపల్లె :మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం దుర్మార్గమని టిడిపి మండల కన్వీనర్‌ రామమునిరెడ్డి అన్నారు. రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. దీక్షలో ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ మహమ్మద్‌ షబ్బీర్‌, మైనార్టీ నేత నిమ్మకాయల మహమ్మద్‌ దర్బార్‌, డివి సుబ్బారెడ్డి, మహమ్మద్‌ ఇనాయతుల్లా, డక్కా రమేష్‌, వీరబద్ర, రామాంజనేయురెడ్డి, వెంకటయ్య, జబిబుల్లా, పాపిరెడ్డి, రెడయ్య, మడక శ్రీనివాసులు, ఆదినారాయణ, పిపి చెండ్రాయుడు, బాలకృష్ణారెడ్డి, యుగంధర్‌, వెల్డింగ్‌ బాష, గోగుల మల్లికార్జున పాల్గొన్నారు.