పల్నాడు జిల్లా: వైసిపి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులతో జైలు జీవితం గడుపుతూ, చర్మ సంబంధిత రుగ్మతలు, డి. హైడ్రే షన్ తో ఇబ్బంది పడుతున్న టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హెల్త్ బులిటెన్‌ను వైద్యులు విడుదల చేయాల్సి ఉండగా ప్రభుత్వ కనుసన్నల్లో పని చేస్తున్న పోలీసు వ్యవస్థ విడుదల చేయడం తమకు అనుమానంగా ఉందని టిడిపి డాక్టర్స్ సెల్ ఉపాధ్యక్షులు డాక్టర్ కడియాల వెంకటేశ్వర రావు అన్నారు. స్థానిక టిడిపి జిల్లా కార్యాలయంలో శని వారం టిడిపి డాక్టర్స్ సెల్ విభాగం ఆధ్వర్యంలో విలే కరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కడియాల మాట్లాడుతూఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసమే చంద్రబాబును అరెస్ట్ చేశారని అన్నారు. చంద్రబాబుని కావాలనే ఇబ్బం దులు పెడుతున్నారని, ఆరోగ్యం దెబ్బ తిన్న ప్పటికీ సరైన వైద్యం అందించకుండా కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నా రని మండిపడ్డారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో అనేక సందేహాలున్నాయని, 45 ఏళ్లకు పైగా సుదీర్ఘ రాజకీయ చరిత్ర 74 ఏళ్ళ వయసు కలిగిన ఆయనను వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. ప్రతిపక్ష టిడిపి నేతలు ఏమి చెప్పినా ప్రభుత్వం వినే పరిస్థితి లేదని విమ ర్శించారు. సొంత బాబారు ని చం పిన వ్యక్తులు నీతి వాక్యాలు మాట్లాడం సిగ్గు చేటని అన్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు మంచి ఆహారం పెట్టడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం సిగ్గుచేటని అన్నారు. వైసిపి నాలుగున్నరేళ్ల పాలనలో అభివృద్ధిని గాలికొదిలి, కక్ష సాధింపులపై దృష్టి సారించారని ఆరోపిం చారు. చంద్రబాబుకు తక్షణమే సూపర్‌స్పెషాలిటీ ఆసు పత్రిలో చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు మెరుగైన వైద్యం అందించకపోతే ఇప్పటి వరకు చేస్తున్న నిరసన కార్యక్రమాలను ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో టిడిపి రాష్ట్ర డాక్టర్ సెల్ అధికార ప్రతినిధి డాక్టర్ నాగోతు ప్రకాష్, జిల్లా డాక్టర్ సెల్ సభ్యులు డాక్టర్ వరబాబు, డాక్టర్ పువ్వాడ సూర్య నారాయణ, డాక్టర్ చేకూరి కోటేశ్వరరావు, డాక్టర్ వీరయ్య చౌదరి, డాక్టర్ లలిత్ సాగర్, డాక్టర్ బాజీ బాబు, డాక్టర్ బండ్ల రామచంద్ర,టిడిపి రాష్ట్ర రైతు విభాగం నాయకులు గొట్టిపాటి జనార్ధన్ బాబు తదితరులు పాల్గొన్నారు.










