ప్రజాశక్తి-యంత్రాంగం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్, రిమాండ్‌ను నిరసిస్తూ టిడిపి ఆధ్వర్యాన చేపట్టిన నిరసనలు, దీక్షలు ఆదివారం కొనసాగాయి. కాకినాడ సిఎం వైఎస్.జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో న్యాయం అంధకారంలోకి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యవస్థలను మేనేజ్ చేస్తూ కుట్రలు పన్నుతున్నారని కాకినాడ సిటీ మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు 26వ రోజు బాబుకు తోడుగా మేము అంటూ స్వర్ణకారుల సంఘ కార్మికులు, మెరైన్ లేత్ వర్క్స్ అసోసియేషన్, శ్రీ భగీరథ సగర సంఘం, షీట్ మెటల్ వర్క్స్ అసోసియేషన్ సభ్యులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. చెల్లుబోయిన శ్రీనివాస్ రావు, గ్రంధి నారాయణరావు పాల్గొని దీక్ష పరులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో ధోనాద్రి అబ్రహాం, తల్లిబోయిన రాముడు, జక్కి విజరు కుమార్, సన్నిపోయిన ఏసేపు, నక్కా సుబ్బారావు, జక్కి సత్యనారాయణ, తంగేళ్ల లోవరాజు, గంట సత్యనారాయణ పాల్గొన్నారు. కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్‌లో టిడిపి శ్రేణులతో కలిసి మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంతలక్ష్మి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారయణ మూర్తి జలదీక్ష చేపట్టారు. తొలుత వలసపాకల సెంటర్‌లో బాబుతో నేను 25వ రోజు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, ఆయన జైలు నుంచి విడుదల అవ్వాలని రణస్థలం మాజీ సర్పంచ్ వారి మిత్రులు శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ చేపట్టిన సైకిల్ యాత్ర కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్ష శిబిరానికి చేరుకుంది. పిల్లి దంపతులు సైకిల్ యాత్రికులను అభినందిచారు. తాళ్లరేవు 'బాబు తో నేను' కరపత్రాలను తాళ్ళరేవు పంచాయతీ బైపాస్ కోలనీ, మాధవరాయుడు పేటలో ఇంటి ఇంటికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ధూళిపూడి వెంకటరమణ (బాబి), క్లస్టర్ ఇన్‌ఛార్జి మందాల గంగ సూర్యనారాయణ, నడింపల్లి వినోద్, రోళ్ల చక్రవర్తి, బండారు శ్రీను, హేమలత, వాడ్రేవు వీరబాబు, టేకుమూడి లక్ష్మణరావు, మాజీ ఎంపిటిసి సత్తిబాబు, దుర్గా ప్రసాద్, గోవిందు, శేఖర్, రమేష్, భాస్కర్, హేమసుందర రావు పాల్గొన్నారు. ప్రతిపాడులో 27వ రోజున మహిళలు నిరసన దీక్షలో పాల్గొన్నారు. నియోజకవర్గ నాలుమూలల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలకు టిడిపి ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి వరుపుల సత్యప్రభ నల్ల కండువాలు వేశారు. తుని నియోజకవర్గం నేత యనమల రాజేశ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఆదివారం సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. అన్నవరం గ్రామం నుంచి ఘాట్ రోడ్డు గుండా పాదయాత్ర చేస్తూ సత్యదేవుని సన్నిధికి తరలివెళ్లారు. అనంతరం సత్యదేవుని దర్శించుకుని బాబుకి అక్రమ కేసుల నుండి బయటపడి బెయిల్ రావాలని పూజలు చేశారు. చంద్రబాబు నాయుడుతోనే తామంతా ఉన్నామని నాయకులు, కార్యకర్తలు ప్రతినబూనారు. పెదపూడి చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మండలంలో చింతపల్లిలో మాజీ ఎంఎల్‌ఎ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు, జనసేన నాయకులు కాగడాల ర్యాలీ చేపట్టారు. కాగడాలు పట్టుకుని బాబుతో నేను విరు వాంట్ జస్టిస్ నినాదాలు చేస్తూ గ్రామంలో పాదయాత్ర చేశారు. జనసేన నాయకుడు రావాడ నాగు, టిడిపి నాయకులు, తమలపూడి శివరామరెడ్డి, జుత్తిక కృష్ణ, పలివెల బుజ్జి, గంట రాజు, జనసేన నాయకులు తదితరులు,పాల్గొన్నారు.










