మాట్లాడుతున్న కోన రఘుపతి
ప్రజాశక్తి-బాపట్ల: బాబుకు వయోభారంతో చంద్రబాబుకు మతిపోయి ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియడంలేదని బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు. సోమవారం కోన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు మతి లేని మేనిఫెస్టోను ప్రకటించారన్నారు. కాపీ పేస్టులతో సరిపెట్టే విధానాన్ని టిడిపి అధినాయకుడు అవలంబించడం సిగ్గుచేటని కోనా అన్నారు. ఆల్ ఫ్రీ అని చెప్పిన బాబు 5ఏళ్ల పాలన ప్రజలకు ఇప్పటికే అర్థమైందన్నారు. ఓటర్ల తీర్పు టిడిపి వైపు మారటం అనేది ఎప్పటికీ జరగదని కోనా రఘుపతి జోస్యం చెప్పారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ డి సీతారామిరెడ్డి, వైసిపి మండల పార్టీ నాయకుడు కోకి రాఘవరెడ్డి, వడ్డిముక్కల డేవిడ్, యజరయ్య పాల్గొన్నారు.










