Oct 20,2023 00:05

-మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌ కుమార్‌

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:చంద్రబాబు నాయుడుకు మెరుగైన వైద్యం అందించాలని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. డుంబ్రిగుడలోని దేశం పార్టీ మండల అధ్యక్షుడు టి సుబ్బారావు నివాసంలోని గురువారం జరిగిన ఓ కార్యానికి హాజరైన మాజీ మంత్రి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక అక్రమంగా అరెస్టు చేశారని, ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పి వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్‌ మాజీ సభ్యుడు సివేరి అబ్రహం, టిఎన్‌టియుసి అరకు పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి ఎం.స్వామి తదితరులు పాల్గొన్నారు.