Sep 29,2023 23:26

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్‌, రూరల్‌ రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి జగన్మోహన్‌ రెడ్డి అరాచక పాలన కొనసాగిస్తున్నాడని కాకినాడ సిటీ మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు విమర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా సిటీలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 16వ రోజుకు చేరుకున్నాయి. నియోజకవర్గ పరిశీలికలు నాగీడి నాగేశ్వరరావు పాల్గొని దీక్షను ప్రారంభించారు. దీక్షాపరులకు నిమ్మరసం ఇచ్చి వనమాడి కొండబాబు దీక్షను విరమింజేశారు. ఈ కార్యక్రమంలో సీకోటి చక్రధరరావు, జక్కి ప్రసాద్‌, దడాల అప్పారావు, తలుపులూరి మేరి, కొప్పల రవళి, తాళాబత్తుల గోవిందరావు, వి.భరత్‌, దారా ప్రసాద్‌, వరప్రసాద్‌, పప్పు దుర్గాప్రసాద్‌, సుధీర్‌ బాబు, అడ్డాల శ్రీను, జక్కి విజరు కుమార్‌, కట్టా సూర్యనారాయణ, నందిక అబ్బులు, వనమాడి పెద్ద ధర్మారావు, సంగాడి వీరబాబు, కామాడి సుబ్బారావు, కర్రి రాజారావు పాల్గొన్నారు. మాజీ మేయర్‌ సుంకర పావని తిరుమల కుమార్‌ ఆధ్వర్యంలో 31వ డివిజన్‌లో కరపత్రాలు పంపిణీ చేశారు. చల్ల పార్వతి, సత్య, నక్క జ్యోతి, రేలంగి లక్ష్మి, కనకం, దుర్గ, సత్యవతి, నిర్మల, రమణ, భ్రమరాంబ పాల్గొన్నారు.
గాంధీ జయంతి పురస్కరించుకుని అక్టోబర్‌ 2నకాకినాడ భానుగుడి జంక్షన్‌ వద్ద నుండి మెయిన్‌ రోడ్డు వరకు పాదయాత్ర చేపట్టినట్టు పార్టీ నాయకులు తెలిపారు. జ్యోతుల నవీన్‌ కుమార్‌ ఆధ్వర్యంలో మాజీ ఎంఎల్‌ఎలు జ్యోతుల నెహ్రూ, వనమాడి కొండబాబు, ఎస్‌విఎస్‌ఎన్‌న.వర్మ, టిడిపి నగర అధ్యక్షుడు మళ్లిపూడి వీరు తదితరులు జిల్లా ఎస్పీ సతీష్‌ను కలిసి వివరాలు తెలియజేశారు. కాకినాడ రూరల్‌ మండలం వలసపాకలలో కాకినాడ రూరల్‌ టిడిపి రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంత లక్ష్మి రిలే నిరాహారదీక్ష చేపట్టారు. బోళ్ల కృష్ణమోహన్‌, మిరపల ప్రకాష్‌, తాతపూడి రామకృష్ణ, సరిదే నాగ హరినాథ్‌, పేరాబత్తుల లోవబాబు, మట్టా ప్రకాష్‌ గౌడ్‌, బావిశెట్టి శ్రీను, పిల్లి రామకృష్ణ, కేశబోయిన ఏడుకొండలు, పలివెల త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.