ప్రజాశక్తి-యంత్రాంగం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు, రిమాండ్‌కు నిరసనగా సోమవారం జిల్లాలో పలుచోట్ల ర్యాలీలు, దీక్షలు చేపట్టారు. కాకినాడ రూరల్ యువత భవిష్యత్తుకు భరోసా చంద్రబాబుతోనే సాధ్యమని టిడిపి రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి అన్నారు. కాకినాడ రూరల్ వలసపాకల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి, సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో బాబుతో నేను కార్యక్రమం కాలేజీ విద్యార్థులతో రిలే నిరాహారదీక్ష నిర్వహించారు. సామర్లకోట రూరల్ చంద్రబాబుకు మద్దతుగా గాంధీ జయంతి సందర్భంగా గాంధీబొమ్మ సెంటర్లో ఉన్న గాంధీ కాంస్య విగ్రహానికి టిడిపి నాయకులు పూల మాలలు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం నిరాహార దీక్షలు చేపట్టారు. పట్టణ పార్టీ నాయకులు అడబాల కుమార స్వామి, బడుగు శ్రీకాంత్, కంటే జగదీష్ మోహన్, బలుసు వాసు, యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, పైన్ని శ్రీనివాస్, తాతపూడి కృష్ణబాబు, ఎస్.రెహమాన్, గొల్తి సత్య నారాయణ, వంశీ కృష్ణ, చల్లా బుజ్జి, కుర్ర రాజు పాల్గొన్నారు. దీక్షలకు జనసేన నాయకుడు తుమ్మల రామస్వామి మద్దతు తెలిపారు. పెద్దాపురం చంద్రబాబుకు అరెస్టుకు నిరసనగా టిడిపి మండల అధ్యక్షుడు కొత్తిం వెంకట శ్రీనివాసరావు ఆధ్వర్యంలోకొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తుమ్మల నాని, రేలంగి బుజ్జి, కొమ్మిరెడ్డి బుజ్జి, ఎగ్గాడ శ్రీను, నల్లబాబు, ఊడి శ్రీను, నూకల మంతి తాతబాబు, పెద్దకాపు, రఘు పాల్గొన్నారు. గండేపల్లి రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరి దీక్షకు మద్దతుగా పోతుల మోహన్ రావు ఆధ్వర్యంలో మాజీ ఎంఎల్‌ఎ జ్యోతుల నెహ్రూ కార్లతో భారీ ర్యాలీగా రాజమహేంద్రవరం వెళ్లారు. ఈ కార్యక్రమానికి మండలం నుండి అధిక సంఖ్యలో మహిళలు పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.










