చంద్రబాబుకు మద్దతుగా నిరసన
చంద్రబాబుకు మద్దతుగా నిరసన
ప్రజాశక్తి -కుప్పం: కుప్పంలో చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆయనకు మద్దతుగా వక్కిలిగా కులస్తులు శనివారం నియోజకవర్గంలో పార్టీ కార్యాలయంలో మద్దతు తెలిపారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తిరుపతి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయ దేవతగా వేషధారణ వేసి న్యాయదేవతకు తక్షణమే చంద్రబాబుకు న్యాయం జరగాలని అర్జీ సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు, వక్కిలిగా కుల నాయకులు హిమంబర్ గౌడు, ప్రశాంత్ గౌడ్, భాస్కర్ గౌడ్, గోపాల్, బాలచంద్ర, అశోక్, వెంకటాచలం గౌడ్ భారీగా మహిళలు పాల్గొన్నారు.










