Sep 30,2023 20:56

ప్రజాశక్తి - పాలకొల్లు
చంద్రబాబుకు మద్దతుగా మోత మోగిద్దాం కార్యక్రమంలో పాలకొల్లు ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు కుటుంబ సభ్యులు శనివారం రాత్రి పాల్గొన్నారు. ఎంఎల్‌ఎ సతీమణి సూర్య కుమారి, కుమార్తె శ్రీజ గట్టిగా టిడిపి కార్యాలయం వద్ద మోత మోగించారు. అలాగే గాంధీ బొమ్మ సెంటర్‌ వద్ద కూడా టిడిపి నేతలు డప్పులు కొడుతూ మోత మోగించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టిడిపి నేతలు పాల్గొన్నారు.
మొగల్తూరు : మొగల్తూరులో టిడిపి నాయకులు శనివారం రాత్రి మోత మోగించారు. ఆ పార్టీ నాయకులు అక్రమ కేసులు ఎదుర్కొంటున్న చంద్రబాబు నాయుడుకు మద్దతుగా ప్లేట్లు, గరిటలు చేతబట్టుకుని శబ్ధాలు చేశారు. ఈలలు వేస్తూ పిడిఆర్‌ కాంప్లెక్స్‌ నుండి గాంధీ బొమ్మ సెంటర్‌ వరకూ ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో మామిడిశెట్టి సత్యనారాయణ, కత్తిమండ ముత్యాలరావు, బస్వాని ఏడుకొండలు, పంపన భగవాన్‌, వెలిది పుల్లారావు, పాము శ్రీధర్‌ పాల్గొన్నారు.
ఆకివీడు : మండంలోని ఐ.భీమవరంలో చంద్రబాబుకు మద్దతుగా టిడిపి నేతలు ఈలలు వేసి మోత మోగించారు. టిడిపి మండల అధ్యక్షులు ఎం.ప్రసాద్‌ ఆధ్వర్యంలో నేతలు వెంకట్రావు, తిరుపతి తదితరులు నినాదాలు చేశారు.