ప్రజాశక్తి -యంత్రాంగం చంద్రబాబు అరెస్టు, రిమాండ్‌కు వ్యతిరేకంగా జిల్లావ్యాప్తంగా ఆదివారం దీక్షలు, ర్యాలీలు కొనసాగాయి. కాకినాడ కార్పొరేషన్ కాకినాడలో మత్స్యకారులు వినూత్నంగా నిరసన చేపట్టారు. 19వ వార్డు పెదజాలరిపేటలో కార్పొరేటర్ నొల్లి నూకరత్నం, బైరెడ్డి పోతన్న ఆధ్వర్యంలో మత్స్యకారులు సముద్రంలో బోట్లపై నిరసన చేపట్టారు. చంద్రబాబు బెయిల్‌పై వచ్చేవరకు నిరసనలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో జివి.రామచంద్రరావు, కార్పొరేటర్ నొల్లి నుకరత్నం, తెడ్డు రాజు, దోడ చిరంజీవి, పిల్లా నూకన్న, ఒలిశెట్టి చినఎల్లయ్య, ఒలిశెట్టి సత్యరావు, పొట్టి అప్పన్న, వాడమదుల శ్రీను పాల్గొన్నారు. మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు బాలాజీ చెరువు సెంటర్‌లో చేపట్టిన దీక్షలు 11వ రోజుకు చేరాయి. అఖిలపక్ష కన్వీనర్ తాటిపాక మధు, నాయకులు పేరాబత్తుల రాజశేఖర్, గ్రంధి బాబ్జి, దీక్షపరులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమంప చేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, పాన్ షాప్ అసోసియేషన్ సభ్యులు మరియు టైలర్స్ అసోసియేషన్ సభ్యులు గోపిశెట్టి బూరయ్య, తోటకూర సూర్యనారాయణ మూర్తి పాల్గొన్నారు. మాజీ మేయర్ సుంకర పావని ఆధ్వర్యంలో నల్ల జెండాలు, ప్లకార్డులతో నేలప్పన్ సెంటర్, సుర్యనారాయణ పురంలో ఇంటింటికీ కరపత్రాలు పంచారు. కాకినాడ రూరల్ వలసపాకలలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి, మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంత లక్ష్మి దంపతులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలో వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన సుమారు 250 మంది విద్యార్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చీడిగలో భారీఎత్తున కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీలో జనసేన నాయకులు పాల్గొని తమ మద్దతు తెలిపారు. కరప 12వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షకు కాకినాడ రూరల్ జనసేన పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, పేరాబత్తుల రాజశేఖర్, నులుకుర్తి వెంకటేశ్వరరావు, వాసిరెడ్డి ఏసుదాసు ఆధ్వర్యంలో వేళంగి పంచాయతీ వద్ద దీక్ష చేపట్టారు. జనసేన నాయకులు భోగిరెడ్డి గంగాధర్, చింతా వెంకట్, అల్లు గంగాద్రి, మురళి, చప్పిడి వెంకటేశ్వరరావు, దేవు వెంకన్న, కోనా వెంకటలక్ష్మి, కె.వినాయక్, బొంతు నాగేశ్వరరావు, గీశాల వెంకటేశ్వరరావు, అడపా రామచంద్రరావు, కె.భూషణం, పురం సత్యప్రసాద్, చుండ్రు వెంకన్నరాయ చౌదరి, పలివెల జానకిరామయ్య, మేడిశెట్టి పట్టాభి, నులుకుర్తి వీరన్న పాల్గొన్నారు. సామర్లకోట రూరల్ మాధవపట్నంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. టిడిపి మండల అధ్యక్షుడు తోటకూర శ్రీనివాస్, పిల్లి కృష్ణ ప్రసాద్, గుమ్మళ్ల రామకృష్ణ, చల్లా బుజ్జి, కుర్రా నారాయణస్వామి పాల్గొన్నారు.










