ప్రజాశక్తి-యంత్రాంగం టిడిపి అధినేత చంద్రబాబుకు మద్దతుగా మంగళవారం పలుచోట్ల దీక్షలు, నిరసన కొనసాగాయి. కాకినాడలో మాజీ మేయర్, టిడిపి జిల్లా మహిళా అధ్యక్షురాలు సుంకర పావని ఆధ్వర్యంలో నల్ల జెండాలు, ప్ల కార్డ్స్‌తో 29వ డివిజన్‌ల కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రిక్క రాజ్యం, చెక్క అమ్మాణి, బొమ్మా సత్య, నక్కా జ్యోతి, రేలంగి లక్ష్మి, కనకం, దుర్గ, సత్యవతి, నిర్మల, రమణ, భ్రమరం, కాసులమ్మ పాల్గొన్నారు. మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో బాలాజీ చెరువు సెంటర్‌లో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు ఎండి అన్సర్, పలివెల రవి, ఎస్‌కె.రహీమ్, మేడిశెట్టి చిన్ని, ఎండి.ఖాన్, కోడూరు పెద్ద, అలీషా, కొపనాతి నాగకుమారి, కసుమూర్, కోనాడ ప్రకాష్ రావు, గడ్డం పూర్ణచంద్రశేఖర్, ఎండి.గౌస్, మొహిద్దీన్ పాల్గొన్నారు. కాకినాడ రూరల్ వలసపాకల సెంటర్లో పార్టీ శ్రేణులతో కలిసి టిడిపి రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంతలక్ష్మి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. గండేపల్లి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే విడుదల చేయాలని కోరుకుంటూ గండేపల్లి నుండి అన్నవరం వరకు రాలి నిర్వహించినట్లు పోతుల మోహనరావు తెలిపారు. కోర్పు సాయి తేజ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఇప్పర్ల సురేష్, గారపాటి గంగాధర్, వెంపాటి సతీష్, పసుమర్తి సుబ్రమణ్యం, వెంపాటి నాని, నిమ్మలపూడి మహేంద్ర, గండేపల్లి మరిడమ్మ తల్లి గుడి వద్ద నుండి అన్నవరం సత్యనారాయణమూర్తి గుడి వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్రను పోతుల మోహననావు, కోర్పు లచ్చయ్య దొర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వెలమాటి కాశి, బొల్లంరెడ్డి రామకృష్ణ, వెంపాటి రాజు, ఇప్పర్ల బాబీ పాల్గొన్నారు. సామర్లకోట రూరల్ భీమేశ్వరాలయం ప్రధాన గోదావరి కాల్వలో టిడిపి నాయకులు కార్యకర్తలు జల దీక్ష చేపట్టారు. నిమ్మకాయల రంగనాగ్, పట్టణ టిడిపి అధ్యక్ష కార్యదర్శులు కుమార్ స్వామి, బడుగు శ్రీకాంత్, రాజా సూరిబాబు రాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్ (చిన్ని), టిడిపి నాయకులు గుమ్మల్ల రామకష్ణ, చీకట్ల వెంకటేష్, అందుగుల జార్జి చక్రవర్తి, గొల్తి సత్యనారాయణ, మహిళలు పాల్గొన్నారు.










