ప్రజాశక్తి-యంత్రాంగం టిడిపి అధినేత చంద్రబాబుకు మద్దతుగా జిల్లాలోని పలుచోట్ల బుధవారం దీక్షలు కొనసాగాయి. కాకినాడ కార్పొరేషన్ కాకినాడ సిటీ మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు నగరంలో 14వ రోజు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. మోకాళ్లపై కూర్చుని అర్ధనగంగా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, గదుల సాయిబాబా, వనపర్తి బద్రి, బంగారు సత్యనారాయణ, కెవిఎస్.మూర్తి, జొన్నాడ వెంకటరమణ, పసుపులేటి వెంకటేశ్వరరావు, గుజ్జు బాబు, వాసిరెడ్డి చిట్టిబాబు, రెడ్నం సత్తిబాబు, షావుకారు బాబూరావు, బుంగా నాగరాజు, పోలిపల్లి జగన్, కామాడి సుబ్బారావు, వడ్డి కాసుల ధోనాద్రి, రాయుడు లక్ష్మణరావు, బొంతు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ టిడిపి రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి, మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంతలక్ష్మి వలసపాకల సెంటర్‌లో 14వ రోజు రిలే నిరాహారదీక్ష శిబిరంలో పాల్గొన్నారు. చంద్రబాబును విడుదల చేసేంత వరకు తమ పోరాటాన్ని ఆపేది లేదని అన్నారు. గండేపల్లిలో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యమ్రంలో పాల్గొన్నారు. ఎలమటి కాశీ ఆధ్వర్యంలో మహాశక్తి చైతన్య రథయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో కోర్పు లచ్చయ్య దొర, ఎస్‌విఎస్.అప్పలరాజు, పోతుల మోహనరావు, కోర్పు సాయి తేజ, బొల్లం రెడ్డి రామకష్ణ, కొత్త కొండబాబు, వెలమాటి కాశి, దాపర్తి సీతారామయ్య, కంచుమర్తి రాఘవ, సుంకవిల్లి రాజు, చాగంటిసత్యనారాయణమూర్తి, ఆళ్ల సత్తిబాబు, వెంపాటి రాజు, ఉప్పలపాటి సత్తిబాబు, ఇప్పర్ల, బాబి, యల్లాటి అమ్మాజీ, గొల్లవిల్లి శ్రీదేవి, గెద్దాడ సత్యవేణి, గొల్లవిల్లి వరలక్ష్మి పాల్గొన్నారు.










