Oct 01,2023 20:31

కరపత్రాలు పంచుతున్న ఇంటూరి నాగేశ్వరరావు

కందుకూరు :నారా చంద్రబాబునాయుడుకు మద్దతు తెలపాలని కోరుతూ కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు కోరారు. పార్టీ పిలుపుమేరకు బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా కందుకూరు పట్టణంలోని సింహాద్రి నగర్‌ లో రెండవ రోజు ఆదివారం ఆయన ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలను టార్గెట్‌ చేయడం, బెదిరింపులకు లొంగకపోతే కేసులు పెట్టడం ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి అలవాటైందన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నార్నే రోశయ్య, స్థానిక నాయకులు కల్లూరి వెంకటేశ్వర్లు, దామా రాంబాబు, ఉప్పుటూరి విష్ణు, పొన్నగంటి వెంకట్రావు, దివి శీను, శ్రీరామ గిరిమూర్తి, ద్రాక్షాయణి, నాయకులు చిలకపాటి మధుబాబు, షేక్‌ రఫీ, గోచిపాతల మోషే ఉన్నారు.