May 17,2023 23:41

గోపాలపట్నంలో చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుతున్న టిడిపి శ్రేణులు

ప్రజాశక్తి -యంత్రాంగం
గోపాలపట్నం :
విశాఖ పర్యటనలో భాగంగా విశాఖ వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు గోపాలపట్నంలో భారీ ఘనస్వాగతం లభించింది. ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యాన తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో తరలివచ్చి చంద్రబాబుకు గజమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తనపై చూపించిన ఆదరాభిమానాలు గణబాబుపై చూపించి అఖండ విజయాన్ని సమకూర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దాడి వెంకట రమేష్‌, గల్లా చిన్న, శరగడం రాజశేఖర్‌, నాయకులు పొలిమేర సీతారాం, నందవరపు సోములు, నరవ పైడిరాజు, బంగారు తులసీరామ్‌, ఎలమంచిలి ప్రసాద్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.
టిడిపి బహిరంగ సభకు బైకు ర్యాలీ
ఆరిలోవ : ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా పెందుర్తిలో జరిగే బహిరంగ సభకు టిడిపి అధినేత చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో 9, 10, 11, 12, 13 వార్డుల పరిధిలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బుధవారం సాయంత్రం బైకు ర్యాలీగా తరలి వెళ్లారు. ఆరిలోవ తోటగరువు నుంచి బాలాజీనగర్‌ మీదుగా బిఆర్‌టిఎస్‌ రోడ్డు ముడసర్లోవ రోడ్డు మీదుగా బైకు ర్యాలీ సాగింది. ఈ ర్యాలీని టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఒమ్మి సన్యాసిరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో టిడిపి నాయకులు ఒమ్మి అప్పలరాజు, మద్దిల రాజశేఖర్‌, బుడుమూరు గోవిందు, ఒమ్మి పోలారావు, ముగడ రాజారావు, గాడి సత్యం, రాగతి అచ్చుతరావు, ఏడువాక సన్యాసిరావు, తురకపూడి బాలస్వామి పాల్గొన్నారు.
తరలిన 98వ వార్డు టిడిపి నాయకులు
సింహాచలం: ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు 98వ వార్డు టిడిపి కార్పొరేటర్‌ పివి.నరసింహ ఆధ్వర్యాన నాయకులు భారీగా తరలివెళ్లారు.