
ప్రజాశక్తి - గుంటూరు, పల్నాడు జిల్లా విలేకర్లు : టిడిపి అధినేత చంద్రబాబుకు నాలుగు వారాల బెయిల్ నేపథ్యంలో గుంటూరు, పల్నాడు జిల్లాల్లో టిడిపి శ్రేణులు సంబంరాలు చేసుకున్నాయి. టపాసులుపేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఇందులో భాగంగా గుంటూరులో మన్నవ మోహనకృష్ణ మిత్రమండలి భారీ ఎత్తున బాణాసంచి కాల్చి సంబరాలు జరుపుకున్నారు. టిడిపి తాడేపల్లి మండల అధ్యక్షులు అమరా సుబ్బారావు ఆధ్వర్యంలో కుంచనపల్లి టిడిపి మండల కార్యాలయం వద్ద, వడ్డేశ్వరం కార్యాలయం వద్ద, నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. పెద్ద ఎత్తున పాల్గొని, బాణసంచా కాల్చారు. అమర సుబ్బారావు, అరవపల్లి శ్రీనివాసరావు, కాట్రగడ్డ మధుసూదనరావు, వీరిశెట్టి శ్రీనివాసరావు, ఈపూరి బాబు, బిరుదుగడ్డ రమేష్, మద్దినేని సుబ్రమణ్యం, ఎస్.కె నాగూర్‌వలి, కోలాంటి మహేశ్వర రావు, శేషం శెట్టి శ్రీనివాసరావు, ఎస్కే నాగుల్, కోలాంటి అశోక్ పాల్గొన్నారు. గుండిమెడలో టిడిపి తాడేపల్లి మండల మాజీ అధ్యక్షులు కొమ్మారెడ్డి కిరణ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం శ్రేణులు స్వీట్లు పంపిణీ చేశారు. భారీగా బాణాసంచా, టపాసులు పేల్చారు. తెలుగు రైతు గుంటూరు జిల్లా అధ్యక్షులు కళ్ళం రాజశేఖర్‌రెడ్డి, టిడిపి మండల ఉపాధ్యక్షులు గుండిమెడ రమేష్‌బాబు, గ్రామ అధ్యక్షులు చిగురుపాటి సుబ్బారావు, నామతోటి రాంబాబు కొల్లి సురేష్, షేక్ నాగుల్, షేక్ ఖాసింబాబు, అనుమోలు సాంబశివరావు, పాటిబండ్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు. తాడేపల్లిలోని టిడిపి కార్యాలయం ముందు సంబరాలు నిర్వహించారు. పట్టణాధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు ఆధ్వర్యంలో బాణసంచా కాల్చారు. మంగళగిరిలోని అంబేడ్కర్ విగ్రహాం వద్ద టీడీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలదండలు వేశారు. తెనాలిలోని పలుచోట్ల బాణసంచా కాల్చారు. గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలేశారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ చదలవాడ అరవిదబాబు ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు. చిలకలూరిపేటలో ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాలలేశారు. బైక్ ర్యాలీ చేయబోగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. మాచర్లలో బాణసంచా కాల్చారు. అమరావతిలో స్వీట్లు పంపిణీ చేశారు. విజయపురిసౌత్‌తో టిడిపి, జనసేన శ్రేణులు బాణసంచా కాల్చారు. పెదకూరపాడులో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దుగ్గిరాల, పొన్నూరు, క్రోసూరు తదితర మండలాల్లోనూ టిడిపి శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.