Oct 31,2023 21:26

చంద్రబాబుకు బెయిల్‌.. టిడిపి సంబరాలు

 జమ్మలమడుగు రూరల్‌ : అరచేతిని అడ్డు పెట్టి సూర్య కాంతిని ఆపడం ఎవరిచేత కాదని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి సి.భూపేష్‌ సుబ్బరామిరెడ్డి అన్నారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిలు మంజూరు కావడంతో స్థానిక పార్టీ కార్యాలయం వద్ద భూపేష్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి, స్వీట్స్‌ పంచి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, పొన్నతోట మల్లి, దేవగుడి యూత్‌ నాగేశ్వరరెడ్డి, తులసిరెడ్డి, దువ్వూరు మురళి, అన్నెబొయిన కొండయ్య, పాలకొవ్వ రమేష్‌రెడ్డి, నెల్సన్‌, జయచంద్ర ఎస్సి సెల్‌, క్రిస్టియన్‌ సెల్‌, బిసి సెల్‌ నాయకులు, పార్టీ నాయకులు. కార్యకర్తలు పాల్గొన్నారు. ఎర్రగుంట్ల : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు షరతులతో కూడిన బెయిల్‌ రావడంతో మంగళవారం టిడిపి శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. పట్టణంలోని నాలుగురోడ్ల కూడలిలో భూపేష్‌రెడ్డి ఆదేశాలమేరకు బాణసంచా పేల్చి, న్యాయం గెలిచిందంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు రమేష్‌రెడ్డి, రాజారెడ్డి, నాగేశ్వరరావు, సంజీవరెడ్డి, సేట్‌, మల్లికార్జున, మల్లేష్‌, కొండారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు(పుట్టపర్తి సర్కిల్‌) : టిడిపి అధినేత నారా చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో ప్రొద్దుటూరులో టిడిపి శ్రేణులు స్వీట్లు తినిపించుకొని, బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. చంద్రబాబును ఉదేశపూర్వకంగానే జైల్లో ఉండేలా చేశారని, ఒకవేళ బయటకు వచ్చినా మళ్లీ ఇబ్బంది పెట్టేందుకు లిక్కర్‌ అనుమతులకు సంబంధించి కొత్త కేసును సిఐడి నమోదు చేయడం సరైన చర్యలు కాదని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, ఇన్‌ఛార్జి జివి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఆయన తండ్రి ప్రతాప్‌రెడ్డి వేర్వేరుగా మాట్లాడారు. చాపాడు : మైదుకూరు నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో రాయల్‌ సర్కిల్‌లో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ వచ్చిన సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొని టపాసులు పేల్చి, కేక్‌ కట్‌ చేసి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ధనపాల జగన్‌, దాసరి బాబు, బీమయ్య, రవి, అన్నవరం సుధాకర్‌ రెడ్డి, రామాంజనేయులు, వెంకట సుబ్బయ్య, నాయకులు పాల్గొన్నారు. సింహాద్రిపురం : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు కావడంతో టిడిపి నాయకులు సంబరాలు జరిపారు. మంగళవారం మండల కేంద్రమైన సింహాద్రిపురంలోని మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి సతీమణి లతారెడ్డి, కుమారుడు రాంరెడ్డి ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున టిడిపి శ్రేణులు పాల్గొన్నారు. ఖాజీపేట : చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ రావడంపై మండలంలోని దుంపలగట్టు గ్రామంలో ఉన్న ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. టిడిపి రాష్ట్ర మాజీ కార్య నిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, పార్టీ సీనియర్‌ నేత రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ రెడ్యం అరుణదేవి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో నాయకులు రెడ్యం నాగేశ్వర్‌రెడ్డి, ఇండ్ల వెంకటరెడ్డి, తవ్వా సుబ్బారెడ్డి, మామిళ్ళ సుబ్బారెడ్డి, పుల్లలచెరువు భాస్కర్‌రెడ్డి, రెడ్డి బయపురెడ్డి, పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, మహిళలు పాల్గొన్నారు. వేంపల్లె : చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ మంజూరు కావడంతో వేంపల్లెలో టిడిపి నేతలు భారీ ఎత్తున టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. టిడిపి మండల కన్వీనర్‌ రామమునిరెడ్డి, ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ మహమ్మద్‌ షబ్బీర్‌ ఆధ్వర్యంలో టిడిపి కార్యాలయం నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పివి రమణ, రామకృష్ణారెడ్డి, మహమ్మద్‌ ఇనాయతుల్లా, డక్కా రమేష్‌, వేమా నారాయణ, పాములూరు చంటి, ఈశ్వరయ్య, అల్లాబకష్‌, యుగంధర్‌, గొటూరు నాగభూషణం, శ్రీనివాసులు, గోగుల మల్లికార్జున, గోగుల మారుతి, మహబూబ్‌ షరీఫ్‌, వెల్డింగ్‌ బాష తో పాటు పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు. వల్లూరు : మండల కేంద్రంలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు మధ్యంతర బెయిల్‌ మంజూరు కావడంతో ఆయన చిత్రపటానికి మండలం నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. మంగళవారం వల్లూరు గాంధీ సెంటర్‌లో టిడిపి నాయకులు, కార్యకర్తలు మండల టిడిపి అధ్యక్షుడు లేబాక నాగేశ్వర్‌ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో తాడిగొట్ల రాఘవరెడ్డి , గడికోట సుధాకర్‌ రెడ్డి, రామసుబ్బారెడ్డి , బాలిరెడ్డి, శివారెడ్డి ,వెంకట రామిరెడ్డి, మధుసూదన్‌ రెడ్డి, రఘునాథరెడ్డి, చిట్టిబాబు , ఓబులేష్‌ యాదవ్‌, సద్దాం హుస్సేన్‌ పాల్గొన్నారు. ఒంటిమిట్ట : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో ఒంటిమిట్టలో మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు నాయకులు, కార్యకర్తలు స్వీట్లు పంచ ుకున్నారు ఈ సందర్భంగా టిడిపి మండల నాయకులు మాట్లాడుతూ న్యాయం గెలిచిందని రాబోయే ఎన్నికల్లో టిడిపి విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, నియోజకవర్గ మహిళా నాయకులు, ఓబులేని సుబ్బమ్మ, సీనియర్‌ న్యాయవాది రామదాసు, మౌలాలి, ఈశ్వరయ్య, ఐవారయ్య, రాంప్రసాద్‌, ఆంజనేయరెడ్డి, నామాల వెంకటయ్య, పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు కడప అర్బన్‌ : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడం పట్ల ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. మంగళవారం ఎన్‌టిఆర్‌ సర్కిల్‌ వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలవేసి, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం భారీ ఎత్తున బాణా సంచా పేల్చుతూ సంబరాలు చేసుకున్నారు. ఈసందర్భంగా పార్టీ నేతలు లక్ష్మిరెడ్డి, అమీర్‌ బాబు, టిడిపి నాయకులు మాజీ సింగల్‌ విండో అధ్యక్షులు మన్మోహన్‌ రెడ్డి, ఆమూరి బాలరాజు, కొండ సుబ్బయ్య, అడ్వకేట్‌ శివశంకర్‌ రెడ్డి, రెహమాన్‌, నాసర్‌ అలీ, జయరాం రెడ్డి, ఇమ్రాన్‌, జయరాం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పోరుమామిళ్ల టౌన్‌ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్‌ మంజూరవడంతో పోరుమామిళ్ల గ్రామపంచాయతీ సర్పంచ్‌ యనమల సుధాకర్‌, తమ్ముళ్లు సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బద్వేల్‌ నియోజకవర్గం అభ్యర్థి బొజ్జ రోషన్న, మాజీ సర్పంచ్‌ ఇమాం హుస్సేన్‌, చెరుకూరి చెన్నా రాయుడు, చెరుకూరి వెంకటసుబ్బయ్య, సెట్టె వెంకటసుబ్బయ్య, కొండా కష్ణారెడ్డి, ప్రొఫెసర్‌ బాష, భైరవప్రసాద్‌, గడ్డం వెంకటేశ్వర్లు, మస్తాన్‌, షరీఫ్‌, బాలాజీ, కరీముల్లా, సెట్టెం, ప్రసాద్‌ వెంకటరెడ్డి, అన్వర్‌బాష, రంతుల, షేక్‌ హుస్సేన్‌, పార్టీ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.