Oct 31,2023 21:18

సంబరాలు జరుపుకుంటున్న టిడిపి నాయకులు

చంద్రబాబుకు బెయిల్‌
టిడిపి నేతల సంబరాలు

ప్రజాశక్తి - విలేకరులు

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో హైకోర్టులో మద్యంతర బెయిల్‌ రావడంతో టిడిపి శ్రేణులు పెద్దఎత్తున్న సంబరాలు జరుపున్నారు. ర్యాలీలు నిర్వహించి టపాకాయలు పేల్చి స్వీట్లు పంచుకొన్నారు.
నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలో టిడిపి కార్యాలయంలో, పటేల్‌ సెంటర్లో నందికొట్కూరు ఇంచార్జ్‌ గౌరు వెంకట్‌ రెడ్డి ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరు వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు అన్ని తొలగి మచ్చలేని చంద్రునిలా వస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి కాకరవాడ చిన్న వెంకటస్వామి, జయసూర్య, కౌన్సిలర్‌ భాస్కర్‌ రెడ్డి, ముత్తు జావలి, ఎస్‌ఎండి జమీల్‌, రసూల్‌ ఖాన్‌, పలుచాని మహేశ్వర్‌ రెడ్డి, బి.జనార్ధన్‌,లాయర్‌ జాకీర్‌ హుస్సేన్‌, ఖాతా రమేష్‌ రెడ్డి, పట్టణ బీసీ సెల్‌ అధ్యక్షులు పాణ్యం వేణుగోపాల్‌, బాలకృష్ణ ఫ్యాన్స్‌ ప్రెసి డెంట్‌ తిమ్మారెడ్డి, మాసూమ్‌, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు ప్రభు కుమార్‌, ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి బి.రాజన్న, తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి : టిడిపి మండల నాయకులు శివారెడ్డి మధుసూదన్‌ రెడ్డి, చిన్న పుల్లారెడ్డి, నాగశేషన్న యాదవ్‌, మోహన్‌ యాదవ్‌, మల్లారెడ్డిల ఆధ్వర్యంలో టిడిపి నేతలు కొత్తపల్లిలో బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. టిడిపి నాయకులు మాజీ సర్పంచ్‌ గణముల పుల్లన్న, రాముడు, పోత నారాయణ, శంకర్‌ రెడ్డి, బాలు నాయక్‌, ఆచారి, వెంకటేశ్వర గౌడ్‌, మల్లయ్య, టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వెలుగోడు పట్టణంలో.. టిడిపి కార్యాలయం నుండి మదీనా మసీదు సెంటర్‌ వరకు బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వెలుగోడు పట్టణ టిడిపి అధ్యక్షులు ఖలీలుల్లా ఖాన్‌, మోమిన్‌ రసూల్‌, హిదాయత్‌ అలి ఖాన్‌, అమీర్‌ హంజా, ముజీబ్‌ పాల్గొన్నారు. చాగలమర్రి : చంద్రబాబు నాయుడుకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో చాగలమర్రి పట్టణంలో రాష్ట్ర టిడిపి మైనారిటీ సెల్‌ ఉపాధ్యక్షుడు ముల్లా అన్సర్‌బాష ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. పాతబస్టాండ్‌, గాంధీ సెంటర్‌, పెద్దమకానం,ముత్యాలపాడు బస్టాండు ప్రాంతాలలో బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. నాయకులు కొలిమి హుసేన్‌వళి, కొలిమిషరీఫ్‌, షాబులు తదితరులు పాల్గొన్నారు. ప్యాపిలి : చంద్రబాబు నాయుడుకు బెయిల్‌ రావడంతో టిడిపి నాయకులు బస్టాండ్‌ ఆవరణలో బాణా సంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అంకిరెడ్డి, రామ్మోహన్‌ యాదవ్‌, చిన్న సుంకయ్య, నాగేంద్ర, సుదర్శన్‌,రామాంజినేయులు, మల్లికార్జున,సత్యం,కోదండ రామయ్య, వెంగలాం పల్లె వెంకటేశ్వర రెడ్డి,బ్యాంకు శీను, ఎస్కెవలి, ఆర్సీ మద్దిలేటి బాల రంగన్న తదితరులు పాల్గొన్నారు. పగిడ్యాల: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బెల్‌పై విడుదల కావ డంతో నందికొట్కూర్‌ టిడిపి మాజీ ఇంచార్జి బండి జయరాజ్‌ ఆధ్వర్యంలో టిడిపి నాయకులు కార్యకర్తలు మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకు న్నారు. ఈ సందర్భంగా బండి జయరాజ్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బాలిరెడ్డి, రంగస్వామి, నరసింహులు, మధు శేఖర్‌, బాలరాజు, రంజిత్‌ టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆత్మకూర్‌: గౌడ్‌ సెంటర్‌ వద్ద ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి టిడిపి కార్యకర్తలు పాలాభిషేకం నిర్వహించారు. అంతకుముందు పట్టణంలో కారుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి సీనియర్‌ నాయకుడు గోవింద్‌ రెడ్డి మాట్లాడారు. టిడిపి నాయకులు జెట్టి వేణుగోపాల్‌, రాజేంద్ర రెడ్డి, మల్లికార్జున్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. గడివేముల: మండలంలోని దుర్వేసి,బిలకల గూడూరు, గడివేముల, కే బోల్లవరం, మంచాలకట్ట, ఎల్కే తండా, ఉండుట్ల గ్రామాలలో భారీగా బాణసంచా కాలుస్తూ టిడిపి కార్యకర్తలు అభిమానులు నాయకులు కేకులు కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాల్లో టిడిపి నాయకులు మంచాల కట్ట మురళీమోహన్‌ రెడ్డి, దుర్వేసి కృష్ణ యాదవ్‌, శ్రీనివాస యాదవ్‌, మాజీ సర్పంచ్‌ అంగజాల భారతి, టిడిపి మహిళా అధ్యక్షురాలు పల్లవి, బొల్లవరం సుభద్రమ్మ, బిలకల గూడూరు ఫరూక్‌, కాలిక్‌ మరిగా అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు. బేతంచర్ల : టిడిపి కార్యాలయం నుండి పాత బస్టాండ్‌ వరకు టిడిపి నేతలు ర్యాలీ నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్షావలి చౌదరి, రాష్ట్ర క్రిస్టియన్‌ కమిటీ కార్యదర్శి మేకల నాగరాజు, క్లస్టర్‌ ఇంచార్జ్‌ బుగ్గనపల్లి రమేష్‌, జిల్లా ఎస్సీ సెల్‌ అధికార ప్రతినిధి రూబిన్‌, వాణిజ్య కమిటీ ప్రధాన కార్యదర్శి మహేష్‌, కౌన్సిలర్‌ రాంగోపాల్‌, రామాంజనేయులు, నియోజకవర్గ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి, వంశీకృష్ణ, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు. రుద్రవరం : రుద్రవరంలోని అమ్మవారి శాల నాలుగు రోడ్ల కూడలిలో టిడిపి ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి కొమ్మలపాటి రాజారావు ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. నాయకులు లింగం వెంకట రంగనాయకులు, జంగా వెంకటేష్‌ రెడ్డి, అల్లడి శేఖర్‌, రాజశేఖర్‌ రెడ్డి, డిష్‌ వెంకటసుబ్బయ్య, గంతి శ్రీనివాసులు, సురేష్‌, చిన్న కంబలూరు శ్రీనివాసులు మజ్జిగ చంద్ర, ప్రహ్లాదుడు గౌడు, సుబ్బయ్య గౌడు, దస్తగిరి, నాగయ్య, హుస్సేనయ్య, పౌలు, చిటికెల ప్రసాద్‌, స్వామి దాసు తదితరులు పాల్గొన్నారు. బనగానపల్లె : పట్టణంలోని టిడిపి కార్యాలయం నుండి పాత బస్టాండ్‌ సమీపం వరకు నాయకులు కార్యకర్తలు ర్యాలీగా వచ్చి బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. టిడిపి వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు టంగుటూరి శీనయ్య, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు బొబ్బల గోపాల్‌ రెడ్డి, బీసీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దరాజు పాలెం భూషన్న, పట్టణ ఉపసర్పంచ్‌ బురానుద్దీన్‌, మైనార్టీ సెల్‌ నియోజకవర్గం అధ్యక్షులు రాయలసీమ సలాం ,నాయకులు అన్వార్‌ సాహెబ్‌, టిప్‌ టాప్‌ కలాం, అల్తాఫ్‌ హుస్సేన్‌, లాయర్‌ నాగేంద్ర రెడ్డి, రేగటి నాగిరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. పాణ్యం : టిడిపి శ్రేణులు మండల వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో జయరామి రెడ్డి,అమర సింహా రెడ్డి,లాయర్‌ బాబు, రంగ రమేష్‌, ఇప్ప సుధాకర్‌, రమణమూర్తి, ఇప్ప సుధా కర్‌, ఖాదర్‌, పుల్లారెడ్డి, వెంకటాద్రి, దుబారు శీను తదితరులు పాల్గొన్నారు. కొలిమిగుండ్ల : కొలిమిగుండ్లలో టిడిపి నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. నాయకులు టైలర్‌ వెంకట్‌ రాముడు, గోపాల్‌, విజరు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.