Oct 31,2023 19:44

ఆదోనిలో సంబరాలు చేసుకుంటున్న నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ మంజూరు కావడంతో ఆదోనిలోని ఎన్‌టిఆర్‌ విగ్రహం దగ్గర టిడిపి నాయకులు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. సోమవారం టిడిపి సీనియర్‌ నాయకులు ఉమాపతి నాయుడు మాట్లాడారు. ఇది ప్రజా విజయమని, బాబు కోసం పోరాటం చేసిన టిడిపి నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు. నాయకులు రంగస్వామి నాయుడు, ఆరెకల్‌ రామకృష్ణ, బాలాజీ, కృష్ణారెడ్డి, మల్లికార్జున, వీరేష్‌, సలకలకొండ ప్రతాపరెడ్డి, దొడ్డనకేరి శివప్ప, 1వ వార్డు ఇన్‌ఛార్జీ వెంకటేష్‌, మాజీ ఎంపిటిసి రంగన్న, తెలుగు రైతు నాయకులు అయ్యన్న ఉన్నారు. అలాగే టిడిపి మాజీ ఇన్‌ఛార్జీ గుడిసె ఆది కృష్ణమ్మ ఆధ్వర్యంలో ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల వద్ద బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. టిడిపి బీసీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిసె శ్రీరాములు, వ్యవసాయ మార్కెట్‌ యార్డు మాజీ డైరెక్టర్‌ గాజుల చంద్రశేఖర్‌, మురళీ, వడ్డేమాన్‌ గోపాల్‌, కర్నూలు జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు రామకృష్ణ, సాధిక్‌ వలీ, బాబురావు, లక్ష్మి కాంత్‌ రెడ్డి, చిరంజీవి, పరమేష్‌, రాఘవరెడ్డి, జయరాం, శ్రీనివాసులు, నరసప్ప, ఖాదర్‌, బాష, శాంతరాజు, వీరేష్‌, భరత్‌ కుమార్‌ ఉన్నారు. ఆస్పరిలో టిడిపి ఇన్‌ఛార్జీ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఆదేశాల మేరకు బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. సొసైటీ మాజీ డైరెక్టర్‌ కృష్ణ, టిడిపి మండల మాజీ కన్వీనర్‌ ఎస్‌.తిమ్మన్న, సీనియర్‌ నాయకులు రామచంద్రా రెడ్డి, నాయకులు సంజన్న, సతీష్‌, దుబ్బన్న, ఈశ్వర్‌, తెలుగు యువత నాయకులు రాఘవేంద్ర, వీరేష్‌, బాలు, మారేష్‌, మహానంది, హంపయ్య, తమన్న, లోకేష్‌ పాల్గొన్నారు. దేవనకొండలోని టిడిపి కార్యాలయం ముందు నాయకులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. టిడిపి మండల కన్వీనర్‌ విజయ భాస్కర్‌ గౌడ్‌, నాయకులు ఉచ్చీరప్ప, బడి గింజల రంగన్న, మాలిక్‌, రాజశేఖర్‌ గౌడ్‌, బండ్లయ్య, నాగరాజు గౌడ్‌, వెలమకూరు సర్పంచి భాస్కర్‌, రాజా సాబ్‌, చాంద్‌, మాబాష, రాముడు, గోవిందు పాల్గొన్నారు. ఆలూరులో టిడిపి ఇన్‌ఛార్జీ కోట్ల సుజాతమ్మ ఆదేశాల మేరకు నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్‌ సర్కిల్‌లో బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. టిడిపి నాయకులు భాస్కర్‌, సురేంద్ర, ఎల్లప్ప పాల్గొన్నారు. ఎమ్మిగనూరు (రూరల్‌)లో కేంద్ర మాజీ మంత్రి, టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయ సూర్య ప్రకాష్‌ రెడ్డి ఆదేశాల మేరకు టిడిపి నాయకులు గాంధీ సర్కిల్‌ నుంచి అంబేద్కర్‌ సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విగ్రహం ఎదుట బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. టిడిపి నాయకులు కదిరికోట ఆదెన్న, వక్ఫ్‌ బోర్డు జిల్లా మాజీ డైరెక్టర్‌ జి.అల్తాఫ్‌, రాష్ట్ర ఉప్పర (సగర) ఫెడరేషన్‌ మాజీ డైరెక్టర్‌ ఉప్పర ఆంజనేయులు, టిడిపి కురువ సాధికారిక కమిటీ పార్లమెంట్‌ నియోజకవర్గ సభ్యులు అడ్వకేట్‌ కెటి.మల్లికార్జున, టిడిపి నందవరం మండల నాయకులు ముగతి వీరారెడ్డి, ఎమ్మిగనూరు మండల నాయకులు బనవాసి శ్రీకాంత్‌ రెడ్డి, మాసుమాన్‌ దొడ్డి బోయ శ్రీనివాసులు, నాగరాజు, టిడిపి ముస్లిం, మైనార్టీ నాయకులు కెఎమ్‌డి.అబ్దుల్‌ జబ్బార్‌, గోరా బాషా, ఆఫ్గాన్‌ వలీబాష, జోహార్‌ అబ్బాస్‌, టిడిపి ఎస్సీ సెల్‌ నాయకులు రోజా ఆర్ట్స్‌ ఉసేని, దర్జీ మోషన్న, అల్వాల ప్రసాద్‌, ఎస్‌.సాల్మన్‌, జాలవాడి ఏసన్న, వన్నెల మోష పాల్గొన్నారు. హాలహర్విలోని బస్టాండ్‌ వద్ద టిడిపి నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. సర్పంచి మల్లికార్జున, అసుంది శ్రీధర్‌, వెంకటేశ్వర రెడ్డి, మారుతి పాల్గొన్నారు.
 

ఆదోనిలో సంబరాలు చేసుకుంటున్న నాయకులు
ఆదోనిలో సంబరాలు చేసుకుంటున్న నాయకులు