Oct 24,2023 19:35

గొంప వెంకటరావును హౌస్‌ అరెస్టు చేసిన పోలీసులు

ప్రజాశక్తి - జామి: చంద్రబాబును అరెస్టు చేసిన వైసిపి సైకో పాలనను ప్రజలకు వివరిస్తూ, బాబుకు అండగా టిడిపి కుటుంబమంతా నిలవాలని మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వరా కళ్యాణ మండపం వద్ద మాజీ జెడ్‌పిటిసి బండారు పెదబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. మండల సమస్యల పై ఎప్పటికప్పుడు పోరాడుతూనే, పార్టీ బలోపేతానికి తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నాయకులు మధ్య ఉన్న చిన్న చిన్న పొరపచ్చాలు పక్కను పెట్టి, అటు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడంతో పాటు నియోజకవర్గాల ఇన్‌చార్జీలుగా ఉన్న వారిని ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవాలని కోరారు. ఓటరు జాబితా వెరిఫికేషన్‌ చేయడంతో పాటు పలు కీలక అంశాలపై 27, 28, 29 తేదీల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత ఎమ్మెల్యే నియోజకవర్గం అభివృద్ధిని కుంటి పరిచిన తీరును ప్రజల్లోకి తీసుకెళ్ళి, వైసిపి వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. పెదబాబు నాయకత్వంలో మండల పార్టీ బలోపేతం చేయాలని, అందుకు పెద్దలు అంతా సహకరించాలని టిడిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంప్రసాద్‌ కోరారు. మళ్ళీ మండల టిడిపి పార్టీలో పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. బండారు పెదబాబు మాట్లాడుతూ గొంప కృష్ణ తీరు మారకపోవడంతో కోళ్లతో కలిసి పని చేయాలని నిర్ణయించు కున్నానని వివరించారు. కోళ్ల నాయకత్వంలోనే పని చేస్తానని స్పష్టం చేశారు. సమావేశంలో వర్రీ రమణ, గనివాడ ఏర్నాయుడు, టిడిపి పార్లమెంటరీ నాయకులు శ్రీలక్ష్మి, టిడిపి మండల అధ్యక్షలు స్వామి నాయుడు, సూర్యారావు, ధనియాల పైడిరాజు వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గొంప వెంకటరావు హౌస్‌ అరెస్ట్‌
వేపాడ: టిడిపి అధిష్టానం పిలుపు మేరకు మనం చేద్దాం జనాసుర దహనం కార్యక్రమానికి సిద్ధమవుతున్న టిడిపి మండల అధ్యక్షులు గొంప వెంకటరావుని వల్లం పూడి పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. దశమి సందర్భంగా గ్రామాల్లో టిడిపి నాయకులు ఈ కార్యక్రమానికి సిద్ధమవుతుండగా పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తుగా హౌస్‌ అరెస్టు చేసి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరాచక, విధ్వంస పాలన సాగిస్తున్న సైకో జగనాసురుడి పీడ పోవాలని నినాదంతో ఈ కార్యక్రమానికి అధిష్టానం శ్రీకారం చుట్టిందన్నారు. కార్యక్రమాన్ని నిర్వహించకుండా ముందు చర్యల్లో భాగంగా హౌస్‌ అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. ఎటువంటి తప్పూ చేయని చంద్రబాబును ఆధారం లేకుండా జైల్లో నిర్బంధించి ఉంచడం అన్యాయమన్నారు. ఇటువంటి రావణసురా పాలన పోవాలంటే ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో టిడిపి గెలుపునకు కృషి చేయాలని కోరారు.