Aug 18,2023 19:07

మాట్లాడుతున్న దళిత నాయకుడు

మాట్లాడుతున్న దళిత నాయకుడు
చంద్రబాబుకంటే దళిత ద్రోహి ఎవరు..?
-వైసీపీ దళిత ప్రజా ప్రతినిధులు
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు:ఈ సమాజంలో మాజీ ముఖ్య మంత్రి నారా చం ద్రబాబు నాయుడు కంటే దళిత ద్రోహి ఇంకెవరున్నారని వైసిపి దళిత ప్రజా ప్రతినిధులు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి దళిత ద్రోహి అంటూ టీడీపీ దళిత నాయకులు కొణతం రఘబాబు, ఇంగిలేల వెంకట చైతన్య కుమార్‌, ఊటుకూరు అవినాష్‌, దార వెంకటేశ్వర్లు, చింతా సీతారామయ్య, కోటేశ్వ రరావులు చే సిన ఆరోపణలను వైసీపీ దళిత ప్ర జాప్రతినిధులు ఎంపీటీసీలు రాయపు శీనయ్య, బల్లి చంద్రశేఖర్‌, మూగ ధనంజరు, విడవలూ రు వెంకటేశ్వ ర్లు, తాని తిరుపతి, పాకం ప్రవీణ్‌, ఈదూరు రమణయ్య, చేసిన విమర్శలను తీవ్రం గా ఖండించారు. ఈ సందర్బంగా శుక్రవారం ఏ ర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరు కుంటారా ? అంటూ దళితులను కించపరుస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దళితులు ఎప్ప టికి మరచిపోరన్నారు.
బాబు దళిత ద్రోహి అని, ఆయన హయాంలో దళితులపై ఎ న్నో దాడులు జరిగాయని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు దళితులు, మహిళల అభ్యున్నతికి ఏ మాత్రం కషి చేయని చంద్రబా బు నాయుడు ఇప్పుడు అండగా ఉంటానంటే నమ్మే పరిస్థితిలో దళితులు లేరన్నారు. దళితులు అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా కషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని వి మర్శిస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. సమావేశంలో వైసీపీ దళిత నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.