Oct 10,2023 00:01

ప్రజాశక్తి-యంత్రాంగం వైసిపి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిన చంద్రబాబును విడుదల చేసే వరకూ పోరాటం ఆగదని పలువురు టిడిపి నాయకులు స్పష్టం చేశారు. సోమవారం పార్టీ ఆధ్వర్యాన దీక్షలు, నిరసనలు కొనసాగాయి. కాకినాడ సిటీ మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో బాలాజీ చెరువు సెంటర్‌లో చేపట్టిన దీక్షలు 27వ రోజుకు చేరాయి. ఈ దీక్షల్లో పలివెల రవి, అనంత కుమార్‌, అంబటి చిన్న, బంగారు సత్యనారాయణ, గదుల సాయిబాబా, నల్లూరి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. అభివద్ధిని పూర్తిగా వదిలేసి రాష్ట్రంలోని వనరులను దోచుకు తింటున్న ముఖ్యమంత్రి జగన్‌ మరలా జైలుకు వెళ్లడం ఖాయమని కాకినాడ మాజీ మేయర్‌, టిడిపి మహిళా జిల్లా అధ్యక్షురాలు సుంకర పావని అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ పావని ఆధ్వర్యంలో నల్ల జెండాలు, బాబుతో నేను ప్లకార్డ్స్‌తో 33వ డివిజన్‌ కామేశ్వరి నగర్‌, కొల్లు వారి వీధి, ఏరుసువారి వీధిలో కరపత్రాలు పంచుతూ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో పార్వతి, సత్య, గుజ్జు అనురాధ, ప్రసన్న, రిక్క లక్ష్మి, పెమ్మాడి సీత, టేకుమూడి అమల, రేలంగి వరలక్ష్మి, కనకం, దుర్గ, సత్యవతి, నిర్మల, రమణ, భ్రమరాంబ, కాసులమ్మ 33వ డివిజన్‌ నాయకులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్‌ వలసపాకల సెంటర్‌లో రూరల్‌ మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహరదీక్షలు 26వ రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కటకంశెట్టి బాబీ, పిల్లి రాధాకృష్ణ, బోళ్ల కృష్ణమోహన్‌, దాయన రామ్‌ప్రసాద్‌, చుండ్రు గోవిందరాజులు, గుండా శ్రీను, ముళ్లపూడి బాపిరాజు, కాకరపల్లి బుజ్జి, చౌదరి, చాట్రాతి సాయిబాబా, కంటే సత్తిబాబు పాల్గొన్నారు. పెద్దాపురం స్థానిక సుధాకాలనీలోని టిడిపి కార్యాలయం వద్ద నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల రంగనాగ్‌, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబు రాజు, కొత్తెం వెంకట శ్రీనివాసరావు, రంధి సత్యనారాయణ, కాకినాడ రామారావు, తూతిక రాజు, ఎలిశెట్టి నాని, నూనె రామారావు, కొరుపూరి రాజు, చాగంటి గోపాలకృష్ణ, బొడ్డు ఉదరు పాల్గొన్నారు.