Oct 31,2023 20:38

సీతానగరంలో బాణా సంచా పేల్చుతున్న టిడిపి నాయకులు

పార్వతీపురం రూరల్‌: టిడిపి అధినేత చంద్రబాబుకు హైకోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌పై విడుదల పట్ల నియోజకవర్గ టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జి బోనెల విజయచంద్ర సంతోషం వ్యక్తం చేశారు. టిడిపి కార్యాలయం ఎదుట బాణాసంచా కాల్చారు. పట్టణంలో ఐటీడీపీ నాయకుడు బార్నాల సీతారాం ఏడవ వార్డు కౌన్సిలర్‌ కోరాడ నారాయణరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.
భామిని : స్థానిక అంబేద్కర్‌ కూడలిలో టిడిపి నాయకులు కేకు కట్‌ చేసి బాణా సంచా కాల్చుతూ ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు భోగాపురపు రవినాయుడు, ప్రధాన కార్యదర్శి మెడిబోయిన జగదీశ్వరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీతానగరం : చంద్రబాబు నాయుడు విడుదలైన సందర్భంగా స్థానిక బజారు నుంచి హనుమాన్‌ జంక్షన్‌ వరకు ఊరేగింపుగా వచ్చి బాణాసంచాలు పేల్చి, ఆంజనేయ విగ్రహం వద్ద కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్ష కార్యదర్శులు కొల్లి తిరుపతిరావు, రౌతు వేణుగోపాలనాయుడు, మండల కమిటీ సభ్యులు బి.శ్రీనివాసరావు, ఎస్‌.శ్రీనివాసరావు, పెద్దబ్బాయి, దాసరి శివున్నాయుడు, పెదబోగిలి సర్పంచ్‌ జొన్నాడ తెరేజమ్మ, గరికయ్య తదితరులు పాల్గొన్నారు.
సీతంపేట : చంద్రబాబు విడుదలైన సందర్భంగా నియోజకవర్గ నాయకులు పడాల భూదేవి కార్యకర్తలకు స్వీట్లు పంచుతూ, బాణా సంచా కాల్చి ఆనందం పంచుకున్నారు.
వీరఘట్టం : స్థానిక అంబేద్కర్‌ జంక్షన్‌ వద్ద టిడిపి నాయకులు సంబరాలు జరిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఉదయాన ఉదయ భాస్కర్‌, తెలుగు యువత అధ్యక్షులు పారిచర్ల వెంకట రమణ, మండల యువత అధ్యక్షులు మాచర్ల అనిల్‌, మండల ప్రధాన కార్యదర్శి చింత ఉమామహేశ్వరరావు, జనసేన నాయకులు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : జియమ్మవలస మండలం పెద్దబుడ్డిడి, ఇటిక, చినకుదమ గ్రామాల్లో టిడిపి నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కురుపాం నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు గురాన శ్రీరామ్మూర్తి, టిడిపి అరకు పార్లమెంట్‌ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, టిడిపి ఎస్టీ సెల్‌ అరకు పార్లమెంటరీ అధికార ప్రతినిధి నందివాడ కృష్ణబాబు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సాలూరు రూరల్‌ : మండలంలోని మామిడిపల్లిలో టిడిపి నాయకులు బాణా సంచా పేల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆముదాల పరమేష్‌, రైతు సంఘం అధ్యక్షులు బూస తవుడు, తడుతూరి తిరుపతిరావు, డొంక అన్నపూర్ణ, కరుణ, భారతి, రవణమ్మ, మజ్జి శ్రీను పాల్గొన్నారు.
కురుపాం : టిడిపి కురుపాం నియోజకవర్గ ఇన్చార్జి టి. జగదీశ్వరి ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్‌ వద్ద చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుతూ, మందు గుండు సామాగ్రిని పేల్చారు. కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్‌ కెవి కొండయ్య, ఎఎంసి మాజీ చైర్మన్‌ కోల రంజిత్‌ కుమార్‌, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ మీడియా కోఆర్డినేటర్స్‌ సుకేష్‌ చంద్రపండా, టిడిపి నాయకులు కిమిడి రామరాజు, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు విడుదలపై లావణ్య హర్షం
కురుపాం : చంద్రబాబు నాయుడు విడుదలైన సందర్భంగా కురుపాం నియోజకవర్గ టిడిపి యువ నాయకులు, టికెట్‌ ఆశావాహురాలు పువ్వల లావణ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె 'ప్రజాశక్తి'తో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడును అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేసి జైల్లో ఉంచి మానసిక క్షోభకు, అనారోగ్యానికి గురిచేసి, అనవసరమైన అక్రమ కేసులు బనాయించి అనేక రకాలుగా ఇబ్బందులు చేస్తున్న వైసిపి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. రానున్న ఎన్నికల్లో కచ్చితంగా టిడిపిని ప్రజలు గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.